గ్యారేజ్ రిలీజ్ డేట్ చేంజ్

ఎన్టీఆర్ లేటెస్ట్ చిత్రం జనతా గ్యారేజ్ ఇదివరకే సెప్టెంబర్ 2 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవనుందని ప్రకటించిన సంగతి తెలిసిందే.అయితే విడుదల కి భారత్ బంద్ ఆటంకంగా మారడంతో విడుదల తేదీ పైన ఎన్టీఆర్ పునరాలోచనలో పడినట్టు సమాచారం.

ఇప్పటికే విపరీతమైన హైప్ క్రియేట్ చేసిన జనతా గ్యారేజ్ రిలీజ్ రోజు ఎటువంటి ఆటంకాలు ఉండకూడదనే ఆలోచనతో చిత్రాన్ని ఒక రోజు ముందే విడుదల చేయాలనీ డిసైడ్ అయ్యారు.ఆంటే సెప్టెంబర్ 1 నే ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ మన ముందుకి వచ్చేస్తున్నాడన్నమాట.

ఇప్పటికే సినిమా రిలీజ్ డేట్ మారడం ఇది రెండో సారి.మొదట ఈ సినిమా ఆగష్టు 12 నే రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించినా ..పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఇంకా క్వాలిటీ ఇవ్వడం కోసం అంటూ సినిమాని సెప్టెంబర్ 2 కి వాయిదా వేశారు.అయితే తాజాగా మళ్ళీ సెప్టెం 1 నే విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.ఏదయితేనేం సినిమా మళ్ళీ వాయిదా పడితే విచారించాలి కానీ ముందే రిలీజ్ అవుతుంటే అభిమానులకి ఇంకా పండుగే కదా మరి.