” ఘాజీ ” కలెక్షన్స్ …లెక్కలివే

టాలీవుడ్‌తో బ‌ల‌మైన ద‌గ్గుపాటి ఫ్యామిలీ నుంచి వ‌చ్చినా రానా ఇప్ప‌టి వ‌ర‌కు సోలోగా ఒక్క క‌మ‌ర్షియ‌ల్ హిట్ కూడా కొట్ట‌లేదు. త‌న‌తో పాటే వ‌చ్చిన హీరోలంతా 30, 40, 50 కోట్లు వ‌సూలు చేస్తుంటే…రానా మాత్రం హిట్ కోసం కుస్తీ ప‌ట్టాల్సి వ‌చ్చింది. ఎట్ట‌కేల‌కు ఘాజీ సినిమాతో రానా సోలోగా తొలి క‌మ‌ర్షియ‌ల్ హిట్ త‌న అక్కౌంట్లో వేసుకున్నాడు.

ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలో తొలి స‌బ్‌మెరైన్ వార్ సినిమాగా తెర‌కెక్కిన ఘాజీ సినిమా మూడో వారంలోనూ స‌త్తా చూపించింది. ఈ సినిమాకు ఇప్ప‌టికే 35 కోట్ల వసూళ్లు రాబ‌ట్టింది. తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో తెర‌కెక్కడం ఈ సినిమాకు బాగా క‌లిసొచ్చింది. ఒక్క తెలుగులోనే రూ.13 కోట్లు రాబ‌ట్టిన ఘాజీ, తమిళ్‌, హిందీలో క‌లిపి రూ.22 కోట్లు కొల్ల‌గొట్టి ఓవ‌రాల్‌గా రూ.35 కోట్లు రాబ‌ట్టింది.

ఈ సినిమా బ‌డ్జెట్ 14 కోట్లైతే.. అమేజాన్ సంస్థ డిజిట‌ల్ రైట్స్ 15 కోట్ల‌కు కొనేసింది.. ఇక శాటిలైట్ హ‌క్కుల రూపంలో మూడు భాష‌ల‌కు క‌లిపి మ‌రో 10 కోట్లు వ‌చ్చాయి. ఇక ఆడియో, డ‌బ్బింగ్ అన్నీ క‌లిపి మ‌రో 2 కోట్ల వ‌ర‌కు వ‌చ్చాయి. ఇలా ఘాజీ అక్కౌంట్లో మొత్తం రూ.65 కోట్లు జ‌మ అయ్యాయి. ఏదేమైనా రానా కేరీర్‌లో ఘాజీ తిరుగులేని సినిమాగా నిలిపోయింది.