టాలీవుడ్ రిమైండ్: 2017 హిట్స్ – ప్లాప్స్‌

ఈ యేడాది టాలీవుడ్‌కు కొత్త సంవ‌త్స‌రం అదిరిపోయే శుబారంభం ఇచ్చినా ఆ ఉత్సాహం ఎక్కువ రోజులు నిల‌వ‌లేదు. సంక్రాంతికి భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయిన మూడు సినిమాలు సూప‌ర్ హిట్ అయ్యాయి. ఖైదీ నెంబ‌ర్ 150 ఏకంగా రూ. 104 కోట్ల షేర్ సాధిస్తే, గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి రూ.77 కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్టింది. ఈ రెండు సినిమాల మ‌ధ్య‌లో రిలీజ్ అయిన శ‌త‌మానం భ‌వ‌తి సైతం రూ.20 కోట్ల షేర్ రాబ‌ట్టింది.

ఇక ఫిబ్ర‌వ‌రిలో నాని జ‌న‌వ‌రి హిట్ ట్రాక్‌ను కంటిన్యూ చేశాడు. ఈ సినిమా ఏకంగా రూ.32 కోట్ల‌కు పైగా షేర్ రాబ‌ట్టి ట్రేడ్ వ‌ర్గాల‌కు సైతం పెద్ద షాక్ ఇచ్చింది. ద‌గ్గుపాటి రానా ఘాజీ మూడు భాష‌ల్లో రిలీజ్ అయ్యి రానాకు సోలోగా తొలి హిట్ ఇచ్చింది. అయితే మ‌రి క‌మ‌ర్షియ‌ల్‌గా బిగ్గెస్ట్ హిట్ కాక‌పోయినా ఓవ‌రాల్‌గా మాత్రం ఓకే అనిపించింది. టాలీవుడ్‌లో తొలి రెండు నెల‌ల్లో ఈ ఐదు సినిమాలు మాత్ర‌మే లాభాలు తెచ్చుకున్న కేట‌గిరిలో చేరాయి.

ఇక ప్లాప్ సినిమాలు, న‌ష్టాల‌ను తెచ్చిన సినిమాల విష‌యానికి వ‌స్తే సంక్రాంతికే వ‌చ్చిన హెడ్‌కానిస్టేబుల్ వెంక‌ట్రామ‌య్య మంచి సినిమా అయినా సంక్రాంతికి పెద్ద సినిమాల మ‌ధ్య‌లో రావ‌డం, థియేట‌ర్లు దొర‌క్క‌పోవ‌డంతో ఈ సినిమా న‌ష్ట‌పోయింది. ఇక జ‌న‌వ‌రి చివ‌ర్లో వ‌చ్చిన మంచు విష్ణు ల‌క్కున్నోడుకు మినిమం వ‌సూళ్లు కూడా రాక‌…థియేట‌ర్ల రెండ్ కూడా రాలేదు.

ఫిబ్ర‌వ‌రిలో భారీ అంచ‌నాల మ‌ధ్య వ‌చ్చిన నాగ్ భ‌క్తిర‌స చిత్రం ఓం న‌మో వేంక‌టేశాయ టాక్ బాగానే ఉన్నా బాక్సాఫీస్ వ‌ద్ద ఘోర‌మైన డిజాస్ట‌ర్‌గా మిగిలి…ఏకండా రూ.20 కోట్ల‌కు పైగా న‌ష్టాలు చూసింది. ఇక డ‌బ్బింగ్ సినిమాల్లో సింగం -3, య‌మ‌న్‌కు మంచి టాక్ వ‌చ్చినా క‌మ‌ర్షియ‌ల్‌గా లాభాలు తేలేదు. సాయిధ‌ర‌మ్ తేజ్ విన్న‌ర్ సినిమా ఓపెనింగ్స్ బాగున్నా బ్రేక్ఈవెన్‌కు చాలా దూరంలో ఆగ‌పోనుంది. ఓవ‌రాల్‌గా ఈ యేడాది టాలీవుడ్‌లో ఖైదీ-శాత‌క‌ర్ణి-శ‌త‌మానం-ఘాజీ-నేనులోక‌ల్ లాభాలు తెస్తే మిగిలిన సినిమాల‌న్ని న‌ష్టాల‌ను మూట‌క‌ట్టుకున్నాయి.