త్రిష దెబ్బ కొట్టేసింది

కొందరు హీరోయిన్లతో సినిమాలు చెయ్యడం వరకూ బాగానే ఉంటుంది కానీ, రిలీజ్‌ చెయ్యడం ఇబ్బందే. హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ మూవీస్‌కి ఇది ఇంకా ఇబ్బంది. ఓ హీరోయిన్‌ని నమ్ముకుని ఆమె మీదే పెట్టుబడి పెట్టి, ఆమె మీదనే ఫోకస్‌తో సినిమా చేశాక, ఆమె పబ్లిసిటీకి సహకరించకపోతే ఎలా ఉంటుంది? ‘నాయకి’ విషయంలో అదే జరిగింది.

మామూలుగానే త్రిష సినిమాలో నటించేస్తుంది కానీ, సినిమా ప్రమోషన్‌ విషయంలో యూనిట్‌కి ఒన్‌ పర్సంట్‌ కూడా సహకరించదు. జనంలోకి రాదు అనే బ్యాడ్‌ టాక్‌ ఉంది. అయితే ఇంతవరకూ కేవలం హీరో పక్కన, హీరోయిన్‌గా త్రిషని చూశారు అంతే. దాంతో ఆమె ప్రమోషన్‌తో సినిమా సక్సెస్‌కి పెద్దగా వేల్యూ వుండేది కాదు. కానీ ‘నాయకి’ విషయంలో అలా కాదు. సినిమాకి ఆమే అన్నీ, అలాంటప్పుడు మరి త్రిష ఎక్కడా సినిమా పబ్లిసిటీకి సహకరించకపోవడం పట్ల గుర్రుమంటోంది చిత్ర యూనిట్‌.

అస్సలు ఒక్కసారి కూడా త్రిష సినిమా పబ్లిసిటీకి రాలేదు. దాంతో సినిమా విడుదలైనాక ‘నాయకి’ని ఆడియన్స్‌ కూడా లైట్‌ తీసుకున్నారు. భారీ రెమ్యునరేషన్‌ తీసుకుంది త్రిష ఈ సినిమా కోసం. తెలుగులో ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌ అనిపించుకున్న త్రిష, నిర్మాతల్ని ఇలా నిలవునా ముంచేయడం గురించి సినీ వర్గాల్లో స్పెషల్‌గా చర్చించుకుంటున్నారు. అదే త్రిష కాకుండా ఇంకెవర్ని తీసుకున్నా కనీసం ఓపెనింగ్స్‌ వచ్చేవని అంటున్నారు. ఇది నిర్మాతలకే కాక, త్రిష కెరీర్‌కి కూడా ఆటంకమైన విషయమే. ఈ విషయాన్ని ముద్దుగుమ్మ త్రిష గుర్తించాలి మరి.