నాని కి సురభి అంత దగ్గరైందా!!

నిఖార్సయిన సక్సెస్‌ కోసం ఎదురుచూస్తున్న ఛార్మింగ్‌ బ్యూటీ సురభి, ఆ సక్సెస్‌ తనకు ‘జెంటిల్‌మెన్‌’ సినిమాతోనే దక్కుతుందనే నమ్మకంతో ఉంది. ఈ బ్యూటీ ఇటీవల శర్వానంద్‌తో ‘రన్‌ రాజా రన్‌’ సినిమాలో మెరిసింది. సినిమా ఘనవిజయం సాధించింది. సురభికి అవకాశాలూ పెరిగాయి. కానీ ఆ సినిమాలో సురభి జస్ట్‌ గ్లామరస్‌ డాల్‌లానే కనిపించింది. పెద్దగా ఆమె నటనా ప్రతిభను చాటుకోడానికేమీ లేదు. తొలి సినిమా ‘బీరువా’ కూడా అంతే. ‘జెంటిల్‌మెన్‌’ సినిమాలో మాత్రం సురభికి నటించడానికి చాలా స్కోప్‌ ఉందట. ఆమె యాక్టింగ్‌ టాలెంట్‌ అదరహో అనేలా ఉంటుందట. నాని, సురభి కమిట్‌మెంట్‌ని పొగిడేస్తున్నాడు కూడా. చాలా డెడికేటెడ్‌గా సురభి ‘జెంటిల్‌మెన్‌’ సినిమాలో నటించిందని నాని చెప్పాడు. ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది.

ఇంకో వైపున ‘జెంటిల్‌మెన్‌’ సినిమాలో సురభి – నాని మధ్య ఆన్‌ స్క్రీన్‌ కెమిస్ట్రీ బాగా పండిందని సమాచారమ్‌. ఓ సీన్‌లో నాని, ఆమెను మోసే సన్నివేశం ఉంటుందట. ఆ సన్నివేశం కోసం డైరెక్టర్‌ షాట్‌ రెడీ చెప్పకుండానే ఆమె ఎగిరేసి, నాని మీదకు ఎక్కేసేదట. వీపు మీద బస్తాని మోసేలా సురభిని మోసేందుకు కొంచెం ఇబ్బంది పడ్డాడట కూడా నాని. అయితే ఆమె చాలా లైట్‌ వెయిట్‌ అంటూ చమక్కు కూడా విసిరాడండోయ్‌. ఇదిలా ఉండగా ‘జెంటిల్‌మెన్‌’ సినిమాలో నాని ఓ డిఫరెంట్‌ బాడీ లాంగ్వేజ్‌తో కనిపించనున్నాడు. అతను హీరోనా? విలనా? అన్న కన్‌ఫ్యూజన్‌ కలిగేలా డిఫరెంట్‌గా అతని పాత్రను తీర్చిదిద్దారట.