నెపోలియన్ కాదు ఖైదీ నెంబర్ 150 ఫైనల్

మెగా మూవీ టైటిల్ కంఫర్మ్ అయింది.చిరంజీవి బ్లాక్ బస్టర్ సినిమాలైన ఖైదీ,ఖైదీ నెంబర్ 786 సెంటిమెంట్ కలిసొచ్చేలా ప్రతిష్టాత్మక చిరు 150 వ చిత్రానికి “ఖైదీ నెంబర్ 150’’ అనే టైటిల్ ని ఖరారు చేశారు.ఈ విషయాన్నీ స్వయంగా చిత్ర నిర్మాత రామ్ చరణ్ ప్రకటించడం తో ఊహాగానాలకు ఇక తెరపడినట్లే.

ఇప్పటికే ఈ సినీ షూటింగ్ శెరవేగంగా జరుగుతోంది.ఇప్పటికే 50 శాతం చిత్రీకరణ పూర్తయింది.వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ మెగా మూవీ తమిళ్ లో విజయ్ నటించిన కత్తి సినిమాకి రీమేక్ అన్న విషయం తెలిసిందే.ఈ సినిమాని స్వయంగా చిరు తనయుడు రాంచరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాంచరణ్ నిర్మిస్తుండగా దేవిశ్రీ సంగీతాన్ని అందిస్తున్నాడు,కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.

రకరకాల పేర్లు పరిశీలనలో వచ్చినా చివరికి “ఖైదీ నెంబర్ 150’ నే ఫైనల్ చేశారు.సెంటిమెంటల్ గానూ సినిమా కథానుసారం కూడా ఇదే టైటిల్ అప్ట్ అనే ఉద్దేశంతోనే ఈ టైటిల్ ని కంఫర్మ్ చేశారు.మొదట్లో ఈ సినిమాకి కత్తిలాంటోడు అనే టైటిల్ ప్రచారంలోకి వచ్చిన అది నిజం కాదంటూ రాంచరణ్ క్లారిటీ ఇచ్చాడు.ఆతరువాత అభిమానులు నెపోలియన్ అనే టైటిల్ డిజైన్ చేసి మరీ ప్రచారం చేశారు అయితే అదీ అటకెక్కింది ఆఖరికి “ఖైదీ నెంబర్ 150’’ చిరు టైటిల్ అయ్యింది.