పట్టు పట్టు బాగా కాకా పట్టు

బాలీవుడ్‌కు వచ్చినంత మాత్రాన తన నేటివిటీ మారిపోదని.. తాను ఎప్పటికీ దక్షిణాది స్టార్నేనని అంటోంది రెజీనా. ఆంఖేన్ 2 చిత్రం ద్వారా బీటౌన్‌లోకి అడుగుపెడుతున్న ఆమె ఇక దక్షిణాధి చిత్రాలకు వీడ్కోలు చెప్పినట్లే అని కొందరు అంటున్నారు. ఈ నేపథ్యంలో రెజీనా వివరణ ఇచ్చింది. ఇటు దక్షిణాదిలో అటు బాలీవుడ్ లో సమస్థాయిలో రాణిస్తానన్న నమ్మకం తనకు ఉందని చెప్పింది.

బాలీవుడ్ చిత్రాలకోసం దక్షిణాదిని వదిలేయడాన్ని తాను ఊహించుకోలేనని, అసలు అలా ఆలోచించే సాహసం చేయనని చెప్పింది. రెండు ఇండస్ట్రీల్లో పనిచేసేందుకు సమయం కేటాయిస్తానని.. దక్షిణాదిని వదిలేసే ప్రసక్తి లేదని అంటోంది. అవకాశాల రీత్యా ఎక్కడికెళ్లినా… తన మనుగడ మాత్రం దక్షిణాదిలోనేనని స్పష్టంచేస్తోంది. తన రూట్స్ ఇక్కడే(దక్షిణాదిలో) ఉన్నాయంటూ తేల్చి చెప్తోంది. ఈ మాటలను బట్టి అమ్మడు మంచి ప్లాన్‌ ప్రకారమే బాలీవుడ్‌కు వెళ్తున్నట్లు తెలుస్తోంది. అక్కడ కుదురుకోకపోయినా.. మళ్లీ ఇక్కడికి వస్తే.. అవకాశాలు దక్కాలిగా. అందుకే రెజీనా కాకా పడుతోందని కొందరు అంటున్నారు.