పవన్ పాలిటిక్స్ కోసం త్రివిక్రమ్ కృషి

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ల స్నేహం గురించి అందరికీ తెలిసిందే అయితే ఇంతకు ముందు త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన రెండు సినిమాలు సూపర్ హిట్ సినిమాలే. అయితే పవర్ స్టార్ అభిమానులు మాత్రం మళ్ళీ ఈ కంబినేషన్లో ఇంకో సినిమా కోసం ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు.

అయితే ఇప్పుడు తాజాగా త్రివిక్రమ్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ సినిమా గురించి ఒక ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ కోసం త్రివిక్రమ్ ఒక పొలిటికల్ యాక్షన్ మూవీ ని ప్లాన్ చేసాడట. మొన్నామధ్య శ్రీకాకుళం లో కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వారికి పవన్ కళ్యాణ్ బాసటగా నిలిచి వారితరఫున పోరాడిన అంశంతో పాటు ఈ మధ్యకాలం లో ప్రజలలోకి వెళ్లి వారి సమస్యలు తెలుకోవటం వంటి విషయాలని కూడా ఈ సినిమాల చూపించే అవకాశం ఉందంటున్నారు.

అయితే ఫుల్ పొలిటికల్ యాక్షన్ తో నది చే ఈ సినిమా 2019 ఎలక్షన్స్ కి ముందు ఈ సినిమా ని రిలీజ్ చేయటానికి ప్లే చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది. చూడాలి మరి ఎలక్షన్స్ వరకు ఆగుతారో లేకపోతే అంతకంటే ముందే రిలీజ్ చేసి పవర్ స్టార్ అభిమానుల్లో ఉత్సాహం నీపితరో.