ప్రభాస్ కి ప్రమోషన్ వచ్చిందోచ్

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఒక హీరో ఒక దర్శకుడికి మూడున్నర ఏళ్ళు కాల్ షీట్స్ ఇవ్వడం మాములు విషయం కాదు.ఎంత దర్శకుడిపై నమ్మకం వున్నా అన్ని సంవత్సరాలంటే కెరీర్ ని రిస్క్ లో పెట్టడమే. అయితే తాను నమ్మిన దర్శకుడికోసం ఎంత రిస్క్ చేయడానికైనా ప్రభాస్ వెనుకాడలేదు.

అర్ధమయ్యే ఉంటుంది ఈపాటికి ఈ కథంతా ప్రభాస్ రాజమౌళి ల బాహుబలి సిరీస్ సినిమాల గురించే.మొత్తానికి శుభం కార్డు పడిపోయింది.బాహుబలి ప్రభాస్ కి బాహుబలి సినిమాతో పనయిపోయింది.మొత్తానికి దర్శకుడు సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని చాప చుట్టేశాడు.

ఇదంతా ఒకెత్తు అయితే..ప్రభాస్ కెరీర్ మిర్చి లాంటి సూపర్ హిట్ తో పీక్స్ లో వున్నప్పుడు బాహుబలికి మూడున్నరేళ్లు కాల్ షీట్స్ ఇవ్వడం తో ప్రభాస్ పొందిన దానికంటే పోగొట్టుకుంది ఎక్కువ అనేవాళ్లూ వున్నారు.ఈ మధ్య కాలం లో ప్రభాస్ చేయవలిసిన  స్క్రిప్ట్స్ ఎన్నో  సుపుర్హిట్స్  అయ్యాయి అన్నది కూడా నిజం.మరో వైపు బాహుబలి అనగానే అందరికి గుర్తొచ్చేది ప్రభాస్ కంటే కూడా రాజమౌళి ని .అంతలా బ్రాండ్ వేసేశాడు రాజమోళి తన సినిమాపై.ఇక ఈ సినిమా తరువాత ప్రభాస్ కెరీర్ ఎలా ఉంటుంది ,ఇంతటి భారీ సినిమాల తరువాత ఎలాంటి స్క్రిప్ట్స్ చేస్తాడన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది.