ప్రభాస్ పెళ్లి పై కృష్ణంరాజు క్లారిటీ…ముహూర్తం ఖరారు.

టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజ‌బుల్ బ్యాచిల‌ర్స్‌లో స్టార్ హీరో అయిన యంగ్‌రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ పెళ్లి గురించి గ‌త కొద్ది రోజులుగా వార్త‌లు వ‌స్తున్నా….దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న మాత్రం రావ‌డం లేదు. తాజాగా ప్ర‌భాస్ పెళ్లి గురించి లేటెస్ట్ ఇన్‌ఫ‌ర్‌మేష‌న్ వ‌చ్చింది. ప్ర‌భాస్ పెద‌నాన్న‌..రెబ‌ల్‌స్టార్ కృష్ణంరాజు త‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా విలేక‌ర్ల స‌మావేశంలో ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు.

2017లో ప్ర‌భాస్ పెళ్లి ఖ‌చ్చితంగా ఉంటుంద‌ని చెప్పిన ఆయ‌న..ప్ర‌భాస్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవ‌ర‌నే విష‌యాన్ని బాహుబ‌లి 2 త‌ర్వాత చెపుతాన‌ని ప్ర‌క‌టించారు. అలాగే వివాహం బాహుబలి తర్వాత ప్ర‌భాస్ చేసే సినిమాకు ముందుగా ఉంటుంద‌ని…ప్ర‌భాస్‌కు జీవితంలో ఏ విష‌యంలో అయినా..ఎప్పుడు ఏం చేయాలో చెప్ప‌క్క‌ర్లేద‌ని కూడా కృష్ణంరాజు తెలిపారు.

ఇక కృష్ణంరాజు స్వ‌యంగా ఈ విష‌యం చెప్ప‌డంతో ప్ర‌భాస్ పెళ్లి 2017లో జ‌ర‌గ‌డం ఖాయంగా క‌న‌ప‌డుతోంది. ప్ర‌భాస్ బాహుబ‌లి 2 రిలీజ్ అయ్యాక ర‌న్ రాజా ర‌న్ డైరెక్ట‌ర్ సుజీత్ డైరెక్ష‌న్‌లో యూవీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌లో ఓ సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ సినిమా ప‌ట్టాలెక్కే ముందే ప్ర‌భాస్ వివాహం జ‌ర‌గ‌నుంద‌ని స‌మాచారం.

ఇక ప్ర‌భాస్ బాహుబ‌లి 2 త‌ర్వాత సుజీత్‌, జిల్ ఫేం రాధాకృష్ణ సినిమాతో పాటు కృష్ణం రాజు  గోపీ కృష్ణ ఫిలిమ్స్ బ్యానర్ పై కూడా ఒక సినిమాని ఒప్పుకున్నాడు.