“బంగారు బాబు” ఇంకో 10 ఇయర్స్ పక్కా !

‘బాబు బంగారం’ సినిమా ఆడియో రిలీజ్‌ ఈవెంట్‌లో ‘బాబు బంగారం’ సినిమా ట్రైలర్‌ విడుదల చేశారు. ఈ ట్రైలర్‌తో సినిమాపై స్పష్టత ఇచ్చేశారు చిత్ర బృందం. ఔట్‌ అండ్‌ ఔట్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌లా ఈ చిత్రాన్ని రూపొందించినట్టున్నారు. లవ్‌, రొమాన్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌, మాస్‌, యాక్షన్‌, క్లాస్‌ ఇలా అన్నీ కలగలిసి ఉండేలా ‘బాబు బంగారం’ చిత్రాన్ని దర్శకుడు మారుతి తెరకెక్కించాడని ట్రైలర్‌ చూస్తే అర్థమవుతుంది. ట్రైలర్‌ని అంత చాకచక్యంగా డిజైన్‌ చేశారు.

Click Here For Trailer

వెంకటేష్‌ హ్యాండ్సమ్‌ లుక్స్‌, నయనతార గ్లామరస్‌ లుక్స్‌ సినిమాకి హైలైట్‌ కానున్నాయి. ‘బొబ్బిలి రాజా’ సినిమా అప్పట్లో వెంకటేష్‌ ఎనర్జీ లెవల్స్‌ని పీక్స్‌లో చూపించిన సినిమా. అంతకు మించిన ఎనర్జీని ‘బాబు బంగారం’ సినిమా ద్వారా వెంకటేష్‌లో ఇప్పుడు చూడవచ్చు. ‘బొబ్బిలి రాజా ఈజ్‌ బ్యాక్‌’ అంటూ ట్రైలర్‌తో వెంకీ అభిమానుల్ని ఎంటర్‌టైన్‌ చేసేశారు. అంతేకాదు వెంకీకి వయసు కూడా ఇంకా మించిపోలేదు అనే విషయాన్ని కూడా తన హ్యాండ్సమ్‌ పర్సనాలిటీతో నిరూపించేశాడు కూడా.

ఎంగేజ్‌లో ఎనర్జీకి, ఇప్పుడు ీ ఎనర్జీ లెవల్స్‌కీ ఏమాత్రం తక్కువ కాకుండా తన యాక్టింగ్‌ జోరు చూపించాడు వెంకీ ఈ సినిమా ద్వారా అని తెలుస్తోంది. ఈ సినిమా విజయం సాధిస్తే ఇకపై మారుతి కూడా పెద్ద డైరెక్టర్స్‌ లిస్టులోకి చేరిపోతాడనే ఊహాగానాలు కూడా విన్పిస్తున్నాయి. ఇప్పటికే స్టార్‌ హీరోలు మారుతిని లైన్‌లో పెట్టినట్లు తెలుస్తోంది.