వెంకీ, మారుతి కాంబినేషన్లో వస్తోన్న ‘బాబు బంగారం’ సినిమాపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయ్. విడుదలకు సిద్దమైన ఈ సినిమా అప్పుడే పోజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంటోంది. సినిమా అంతా ఫుల్ ఎంటర్‌టైన్‌మెంటేనట. కడుపుబ్బా నవ్వుకునే కామెడీతో వెంకీ అలరించబోతున్నాడట. ఇప్పటికే విడుదలైన టీజర్స్, ట్రైలర్స్‌తోనే సినిమా టాక్ని ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు వెంకీ ఫ్యాన్స్. పోలీసు పాత్రలో ‘అయ్యో అయ్యో అయ్యయ్యో ..’అనే వెంకీ పాపులర్ డైలాగ్ అయితే జనాన్ని బాగా రీచ్ అవుతోంది. అప్పట్లోనే ఈ డైలాగ్ చాలా పాపులర్. ఈ డైలాగ్‌తో మళ్లీ వెంకీ ది బ్యాక్ అనేలా సినిమా ప్రోమోస్‌ని కట్ చేశారు.
ఈ మధ్య ‘గోపాల, గోపాల’, దృశ్యం’ వంటి విలక్షణ సినిమాలతో ఆకట్టుకున్న వెంకీ మళ్లీ ఈ సినిమాతో తన మార్కు కామెడీతో ముందుకొస్తున్నాడు. ఈ సినిమాల్లో పెద్ద తరహా పాత్రల్లో చాలా హుందాగా కనిపించిన వెంకీ ఈ సినిమా కోసం పాతికేళ్ల కుర్రాడిలా తయారయిపోయాడు. అంతేకాదు నయనతారతో వెంకీ ఆన్ స్క్రీన్ రొమాన్స్ కూడా ఆదుర్స్ అంటున్నారు. ఇండస్ట్రీలో వీరిద్దరిదీ సక్సెస్ఫుల్ కాంబినేషన్. ‘లక్ష్మి’, ‘తులసి’ సినిమాల్లో కలిసి నటించారు. నయనతార కూడా జస్ట్ ట్వంటీస్ అన్నట్లుగా చాలా అందంగా ఉందట ఈ సినిమాలో. కేవలం కామెడీ, రొమాన్స్‌కే కాకుండా యాక్షన్‌కి కూడా మంచి స్కోపిచ్చాడట మారుతి ఈ సినిమాలో. ఒక పక్క పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తూనే, మరో పక్క హత్తుకునే సెంటిమెంట్ కూడా పండిస్తాడట. ఎలాగూ సెంటిమెంట్‌తో కూడిన ఎంటర్టైన్మెంట్కి వెంకీ ఈజ్ ద బెస్ట్ హీరో. ఇలా నవరసాల్ని నిండుగా ఆస్వాదించాలంటే జూలై 1 వరకూ వేచి చూడాల్సిందే. ఎందుకంటే ఈ సినిమా రిలీజ్ అయ్యేది ఆ రోజే కాబట్టి.