బాలయ్యకు నచ్చిన మహేష్ పాలసీ

టాలీవుడ్ లో స్టార్ హీరోస్ ఎప్పుడూ ఏదో ఒక కొత్త ట్రెండ్ ని క్రియేట్ చేస్తూ వుంటారు. ఈసారి కొత్త ట్రెండ్ ని క్రియేట్ చేసింది మాత్రం మహేష్ బాబు. ఆయన తీసిన శ్రీమంతుడు సినిమాకి రెమ్యూనరేషన్ తీసుకోకుండా లాభాలలో వాటా తీసుకున్నాడు ఈ పాలసీ వల్ల మహేష్ కి రూ.25 కోట్లు వచ్చాయి. ఆ తరువాత ఇదే పాలసీ ని పవన్ కళ్యాణ్ కూడా సర్ధార్ గబ్బర్ సింగ్ కి ఫాలో అయ్యాడు.

ఇప్పుడు ఇదే తరహాలో నట సింహం నందమూరి బాలకృష్ణ కూడా తన వందో సినిమా అయినా గౌతమి పుత్ర శాతకర్ణి చేస్తున్నాడట. ఈసినిమా కి డైరెక్ట‌ర్ క్రిష్‌, నిర్మాత‌గా కూడా వ్య‌వ‌హ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ సినిమాలో న‌టిస్తున్నందుకు గాను బాల‌య్య రెమ్యున‌రేష‌న్ తీసుకోవడం లేద‌ట‌. టోట‌ల్ సినిమా బిజినెస్ కంప్లీట్ అయ్యాక‌…అందులో ఇంత అని వాటా తీసుకునేలా ఒప్పందం కుదిరిన‌ట్టు తెలుస్తోంది.

ఇక క్రిష్ ఈ సినిమాను రూ.45-50 కోట్ల లోపు బ‌డ్జెట్‌లో పూర్తి చేయాల‌ని అనుకుంటున్న‌ట్టు తెలుస్తోంది. ఇక టోట‌ల్ బిజినెస్‌, శాటిలైట్ రైట్స్ క‌లుపుకుంటే శాత‌క‌ర్ణికి రూ.70 కోట్ల వ‌ర‌కు బిజినెస్ జ‌ర‌గొచ్చని తెలుస్తోంది. మ‌రి అందులో బాల‌య్య వాటా ఎంత అనేదే తెలియాల్సి ఉంది.