బాలయ్యను మెప్పించిన తమిళ డైరెక్టర్

యువ‌ర‌త్న నంద‌మూరి బాలకృష్ణ 100వ చిత్రంగా వచ్చిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. శాత‌క‌ర్ణి సినిమా బాల‌య్య గ‌త సినిమాల రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొడుతూ బాక్సాఫీస్ వ‌ద్ద ఇప్ప‌టికే రూ.63 కోట్ల షేర్ రాబ‌ట్టింది. శాత‌క‌ర్ణి విజ‌యం ప్ర‌తి తెలుగువాడు గ‌ర్వించేలా ఉంది. ఈ గ్రాండ్ స‌క్సెస్‌ను ఎంజాయ్ చేస్తోన్న బాల‌య్య ఇప్పుడు త‌న 101వ సినిమాపై దృష్టి సారిస్తున్నాడు.

బాల‌య్య 101వ సినిమాగా క్రియేటివ్ డైరెక్ట‌ర్ కృష్ణ‌వంశీ ద‌ర్శ‌క‌త్వంలో రైతు సినిమా ఉంటుంద‌ని ముందు అనుకున్నారు. అయితే ఆ సినిమా క‌థ బాల‌య్య అనుకున్న స్థాయిలో రాక‌పోవ‌డంతో ఇప్పుడు తాత్కాలికంగా ఆ ప్రాజెక్టును ప‌క్క‌న పెట్టేసిన‌ట్టే అని తెలుస్తోంది.

ఈ నేప‌థ్యంలోనే బాల‌య్య ఇప్పుడు ఓ త‌మిళ ద‌ర్శ‌కుడు చెప్పిన క‌థ‌కు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చాడ‌ని తెలుస్తోంది. దీనిపై పూర్తి అధికారిక ప్ర‌క‌ట‌న రాక‌పోయినా గ‌తంలో మెగాస్టార్ చిరంజీవితో స్నేహంకోసం సినిమాను రూపొందించిన కేఎస్‌.ర‌వికుమార్ డైరెక్ష‌న్‌లో బాల‌య్య 101వ సినిమా ఉంటుంద‌ని తెలుస్తోంది.

తమిళంలో అగ్ర కథానాయకులందరితోను సినిమాలు చేసిన కె.ఎస్. రవికుమార్, తెలుగులోనూ చిరంజీవి – నాగార్జున – రాజ‌శేఖ‌ర్‌ల‌తో కూడా సినిమాలు చేశాడు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న చెప్పిన లైన్ కొత్త‌గా ఉండ‌డంతో బాల‌య్య ఓకే చెప్పేశాడ‌ని అంటున్నారు. దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.