బాహుబలి-2కి రాజమౌళి ప్యాక్అప్

అవును ఎట్టకేలకు దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి-2 కి ప్యాక్ అప్ చెప్పేసాడు.అదేనండి సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఫైనల్ గా ప్యాక్ అప్ చెప్పేసాడు.సగటు సినీ ప్రేక్షకులందరూ బాషా బేధం లేకుండా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న బాహుబలి-2 షూటింగ్ పూర్తి చేసుకుంది.

ఇదే విషయాన్ని స్టార్ కెమెరామెన్.. రాజమౌళి టీం లో అతిముఖ్యమైన సెంథిల్ షేర్ చేసుకున్నాడు.రాత్రి పగలు తేడా లేకుండా పడ్డ కష్టం ప్యాక్ అప్ చెప్పే సరికి ఒక్కొక్కరి మొహం పై చిరునవ్వు చూడండంటూ బాహుబలి సాంకేతిక నిపుణుల టీం తో కలిసి దిగిన ఫోటోని కూడా సెంథిల్ షేర్ చేసుకున్నాడు.

షూటింగ్ అయితే అయ్యింది కానీ దానికి సీజీ వర్క్ అని 3D అని అనేక రకాల సాంకేతిక పనులు బాకీ వున్నాయి.రాజమౌళి సినిమా అనగానే సాంకేతికంగా ఒక సినిమాను మంచి మరోటి ఉంటూ వస్తోంది.ఇక ఈ బాహుబలి-2 సాకేతికంగా ఎన్ని వండర్స్ చూపిస్తుందో వేచి చూడాల్సిందే.అయితే ఓ వైపు షూటింగ్ చేస్తూనే మరో వైపు గ్రాఫిక్స్ పనులు కూడా రాజమౌళి దగ్గరుండి నడిపిస్తూ చాలా పని దాదాపు పూర్తయిపోయినట్టు వినికిడి.అయితే మిగిలిన ప్యాచ్ వర్క్ కూడా ఫినిష్ చేసుకుని ఈ వేసవిలోనే బాహుబలి-2 మనముందుకు వచ్చే అవకాశాలు అయితే పుష్కలంగానే వున్నాయి.