బాహుబలి-2 ఫైనాన్షియర్ ఎవరో తెలుసా..!

సినిమా ఇండ‌స్ట్రీలో సినిమాలు తీసే నిర్మాత‌ల ద‌గ్గ‌ర  వంద‌ల కోట్లు ఉన్నా వాళ్లు మాత్రం త‌మ సినిమాల కోసం సొంత డ‌బ్బులు పెట్టుబ‌డిగా పెట్ట‌రు. ఫైనాన్షియ‌ర్ల ద్వారానే డ‌బ్బులు స‌మ‌కూర్చుకుంటారు. సినిమా బిజినెస్ కంప్లీట్  అయ్యాక ఫైనాన్షియ‌ర్ల‌కు ఇవ్వాల్సిన డ‌బ్బును వ‌డ్డీతో స‌హా చెల్లించాక త‌మ‌కు మిగిలిందే లాభంగా భావిస్తారు. ఇక బాహుబ‌లి సినిమాకు సైతం రూ.450 కోట్లు ఖ‌ర్చు చేసిన‌ట్టు ఆ సినిమా నిర్మాత శోభు యార్ల‌గ‌డ్డ చెప్పారు.

అయితే ఈ డ‌బ్బంతా వాళ్లు సొంతంగా పెట్టుబ‌డి పెట్టింది కాదు…వాళ్లు కూడా ఫైనాన్షియ‌ర్ల నుంచే అప్పుగా తీసుకున్నారు. రెండు పార్టుల‌కు పెట్టిన పెట్టుబ‌డి మొత్తం రూ.450 కోట్ల‌ని వాళ్లు చెపుతున్నారు. ఇందులో ఓ రెగ్యుల‌ర్ ఫైనాన్షియ‌ర్ ద్వారా రూ. 3 వ‌డ్డీకి 25 కోట్లు అప్పుగా తీసుకున్నార‌ట‌.

ఇక ఫ‌స్ట్ పార్ట్‌కు చాలా వ‌ర‌కు రామోజీరావు నుంచి రూ.2 వ‌డ్డీకి అప్పు తీసుకున్నార‌ట‌. ఫ‌స్ట్ పార్ట్ పూర్త‌య్యాక రామోజీకి ఇవ్వాల్సిన అప్పు మొత్తం చెల్లించార‌ట‌. ఇక రామోజీ ఫిల్మ్‌సిటీని వాడుకున్నందుకు గాను ఆ మొత్తం చెల్లించ‌లేక కొంత షేర్ కూడా ఆయ‌న‌కు ఇచ్చిన‌ట్టు స‌మాచారం.

ఇక రెండో పార్ట్ కోసం దాదాపు వంద కోట్ల రూపాయల్ని మ్యాట్రిక్స్ ప్రసాద్ నుంచి వడ్డీకి తెచ్చారట. మ్యాట్రిక్స్ ప్ర‌సాద్ కేవ‌లం రూపాయిన్న‌ర‌కే వ‌డ్డీకి ఇచ్చార‌ట‌. ఆయ‌న ఇంత త‌క్కువ‌కు ఫైనాన్ష్ చేయ‌రు. అయితే ఈ త‌క్కువ వ‌డ్డీ ఆఫ‌ర్ కేవ‌లం బాహుబ‌లికే మాత్ర‌మే ద‌క్కింది. అందుకే ది కంక్లూజన్ ప్రి రిలీజ్ ఈవెంట్లో ఆయన్ని టీం సభ్యులు బాగా గౌర‌వించిన‌ట్టు ఇండ‌స్ట్రీలో వినిపిస్తోన్న గుస‌గుస‌.