బాహుబలి 2 రికార్డ్స్ కి అదే ప్లస్ అయ్యింది మరి మహేష్ పరిస్థితేంటో

బాహుబలి 2  ట్రైలర్ రిలీజ్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ట్రైలర్ రిలీజ్ అయిన మొదటి రోజే యూట్యూబ్ లో ఇంతకు ముందున్న అన్ని సినిమాల రికార్డులని బ్రేక్ చేస్తుంది. మొత్తంగా ట్రైలర్ రిలీజ్ అయ్యి రెండవ రోజు పూర్తవక ముందే 50 మిలియన్ వ్యూస్ ని క్రాస్ చేసేసింది. అయితే ఈ ట్రైలర్ కి అన్ని వ్యూస్ రావటానికి సినిమా పై ముందునుంచి వున్నా క్రేజ్ ఒకటయితే దానికి తోడుగా నిలబడింది మాత్రం రిలయన్స్ కొత్తగా ప్రవేశపెట్టిన జియో ఫ్రీ డేటా ఆఫర్ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇది వింటుంటే నిజమేనేమో అనిపిస్తుంది కూడా అయితే ఇక్కడ మహేష్ అభిమానులు మాత్రం టెన్షన్ పడుతున్నారు దాని కి కారణం కూడా జియో నే. ఎందుకంటే మార్చ్ 31 నాటికి జియో ఫ్రీ డేటా ఆఫర్ ముగియనుంది మహేష్ మురుగదాస్ కంబినేషన్లో వచ్చే సినిమా టీజర్ మార్చ్ 31 లోపు వస్తేనే ఆ టీజర్ కి  వ్యూస్ అధికంగా వస్తాయి లేకపోతే వ్యూస్ తగ్గిపోయే ప్రమాదం ఉందని ఆలోచనలో పడిపోయారు.

చూద్దాం జియో ఆఫర్ మెగాస్టా ఖైదీ నెం:150 కి, బాలయ్య 100 వ సినిమా గౌతమి పుత్ర శాతకర్ణికి , బన్నీ దువ్వాడ కి , ఇప్పుడు బాహుబలి 2 కి బాగానే సపోర్ట్ ఇచ్చింది. చూద్దాం మహేష్ జియో ఆఫర్ ని వాడుకుంటాడో లేదో.