మళ్లీ దుమ్ము రేపుతున్న రజినీ “కబాలి

సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం కబాలి విడుదలకు ముందే సెన్సేషన్ తో దుమ్ము రేపుతోంది. ఆ సినిమాలోని ఓ సాంగ్ టీజర్ను చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో విడుదల చేసింది అంతే తమిళంలో ‘నిరుప్పుడా’ పాట టీజర్ విడుదల చేయటమే ఆలస్యం లక్షల్లో వ్యూస్ కొల్లగొట్టింది. ఒక్కరోజులోనే 3,417,666 వ్యూస్ వచ్చాయి. ఆడియో ఫంక్షన్ఇ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూసిన రజినీ అభిమానులకి ఇటీవల ఈ చిత్రం ఆడియో ఎలాంటి అట్టహాసం లేకుండా విడుదల చేసి తీవ్ర నిరాశకు గురిచేసారు . అంతలోనే ఈ సాంగ్ టీజర్ను విడుదల చేసి అభిమానులకి గిఫ్ట్ ఇచ్చాడు రజినీ. గతంలోనూ ఈ చిత్రం టీజర్‌ అత్యధిక వ్యూస్‌తో రికార్డు సృష్టించింది కూడా.