మెగా వారసులపై ‘ఉపాసన’ కామెంట్

మెగాస్టార్ కోడలు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య అయిన ఉపాసన లేటెస్ట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూ లో మెగా వారసుల పై క్లారిటీ ఇచ్చింది. అపోలో లైఫ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ గా, ‘బీ పాజిటివ్‌’ మేగజీన్‌ ఎడిటర్‌ గా , చారిటీ వర్కర్‌ వంటి బాధ్యతలు కూడా ఉపాసన నిర్వర్తిస్తోంది.

ఈ మధ్య కాలంలో రామ్ చరణ్ ఉపాసన విడాకులు తీసుకున్నారనే గాసిప్ కూడా సోషల్ మీడియాలో వచ్చిందని అదంతా అబద్ధమని, చరణ్ తను బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పింది. మరి మెగా వారసుడిని ఎప్పుడిస్తున్నారని అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ మేము ఇపుడే కొత్త ఇల్లు కట్టుకుంటున్నాం అది పూర్తయిన తరువాత ఆ ఇంట్లో చరణ్‌తో చాలా టైమ్‌ స్పెండ్‌ చేస్తా. ఆ తర్వాతే పిల్లలు’ అని చెప్పింది.

అయినా ఇప్పుడే చాల కష్టపడి సన్నబడ్డాను ఇప్పుడే పిల్లలంటే మళ్ళీ లావవ్వాలి అయినా అది పర్సనల్ విషయం కదా నేను ఎప్పుడైతే పిల్లల్ని కనాలనుకుంటానో అప్పుడే కంటాను. దాని గురించి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. నా వెనకాల అపోలో మొత్తం ఉంది అని 3 వ తరం మెగా వారసులపై క్లారిటీ ఇచ్చారు ఉపాసన.