మెగా హీరోల కోసం పోటీ పడుతున్న తారలు

టాలీవుడ్ లో మెగా ఫామిలీ కి ప్రత్యేక మయిన క్రేజ్ వుంది. పేరుకు తగ్గట్టే ఈ ఫామిలీ లో ఏడుగురు హీరోలున్నారు. అందుకే టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ హీరోయిన్ అయినా ఈ మెగా క్యాంపు లో చేరిపోవాలనుకుంటుంది. ఎందుకంటే ఈ క్యాంప్ లో ఒక్క హీరోతో సినిమా చేసే ఛాన్స్ వస్తే చాలు ఆ హీరో రిఫరెన్స్ తో ఇంకో హీరోతో సినిమా చేసే ఛాన్స్ కొట్టే యొచ్చు. ఆ రకంగా చుస్తే ఒక్క సినిమా లో ఛాన్స్ వస్తే రెండు మూడు సినిమాలు చేసే అవకాశం వచ్చినట్టే.

ఇప్పుడు బన్నీ వక్కంతం వంశీ కాంబినేషన్లో ఒక సినిమా ఫైనల్ అయ్యింది ఈ సినిమా లో హీరోయిన్ ఛాన్స్ కోసం కీర్తి సురేష్, శృతిహాసన్ పోటీ పడుతున్నారట. శృతిహాసన్ ఇంతకుముందు పవన్ కళ్యాణ్ తో గబ్బర్సింగ్, రామ్ చరణ్ తో ఎవడు, బన్నీ తో రేస్ గుర్రం సినిమాలు చేసింది. ఇప్పుడు మళ్ళీ బన్నీతో జతకట్టటానికి పోటీ పడుతుంది. కీర్తీ సురేష్ టాలీవుడ్ లో వరస హిట్ లు కొట్టినప్పటికీ ఇప్పటివరకు మెగా కాంపౌండ్ లో సినిమా చేసే అవకాశం దక్కలేదు. అందుకే ఎలాగయినా బన్నీ సినిమాలో అవకాశం కొట్టి మెగా కాంపౌండ్ లో జాయిన్ అవ్వాలని గట్టిగానే ట్రై చేస్తుందట.

ఇంకో పక్క మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మణిరత్నం డైరెక్షన్ లో ఒక సినిమా చేయటానికి రెడీ అయ్యాడు. మణిరత్నం సినిమాలలో హీరోయిన్స్ కి మంచి క్యారెక్టర్స్ ఉంటాయి అందుకే ఇప్పుడు   ఈ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ కోసం  ఆల్రెడీ మెగా క్యాంపులో సినిమాలు పూర్తి చేసిన కాజల్, తమన్నాలు పోటీ పడుతున్నారట. అయితే మణిరత్నం మాత్రం ఫ్రెష్ హీరోయిన్ ని తీసుకునే ఆలోచనలో వున్నాడట.