రజనికాంత్ జాకీ చాన్ మల్టీ స్టారర్

రెండు దేశాలు…ఇద్దరు సూపర్ స్టార్లు…ఈ ఇద్దరితో సినిమా తీస్తే ఎలా ఉంటుంది? అన్న ఆలోచన వచ్చింది ఓ ప్రొడ్యూసర్ కు. నిజంగానే ఇది సూపర్ ఐడియా. ఇప్పటివరకు తీసిన మల్టీ స్టారర్ సినిమాలు చాలావరకు ఒక లాంగ్వేజ్ హీరోలతోనో లేదా రెండు భాషల హీరోలతోనో తీసినవే. కానీ…రెండు దేశాల హీరోలతో తీస్తే… ఆ సినిమాను ఏమంటారు? ఇంటర్నేషనల్ మల్టీ స్టారర్ అనవచ్చు. ఇలాంటి ఓ వెరీ బిగ్ మూవీ ప్రాజెక్ట్ ప్లానింగ్ లో ఉందట.

మలేసియా ప్రొడ్యూసర్ మహమూద్ రఫీజీ మహమూద్ జిన్ ఓ భారీ ఇంటర్నేషనల్ మూవీ ప్రాజెక్ట్ కు ప్లాన్ వేశాడు. ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్, ఇంటర్నేషనల్ సూపర్ స్టార్ జాకీచాన్ తో ఒక అదిరిపోయే మూవీని చేయాలనుకుంటున్నాడు. ఇప్పటికే ఆ నిర్మాత రజనీకాంత్, జాకీచాన్ లను సంప్రదించాడట. అయితే ఆ మూవీకి ‘చినీ పాగ’… అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది.

ఇద్దరు మూవీ లెజెండ్స్ నటించే ఈ మూవీలో హీరోయిన్ గా బాలీవుడ్ సోనమ్ కపూర్ ను అడిగారట ఆ ప్రొడ్యూసర్. మలేసియా నటీనటులు కొందరు కీలక పాత్రల్లో నటిస్తారట. మలేసియాలోని చిని అనే సరస్సు లో ఉండే డ్రాగన్ పైనే ఈ సినిమా స్టోరీ నడుస్తుందట. ఇండియా, నార్వే, థాయిలాండ్, ఇండోనేసియా, చైనాల్లో ఈ సినిమా షూటింగ్ కు ప్లాన్ చేస్తున్నారట. నాలుగేళ్ల కిందటే ఈ సినిమా చేయాలనుకున్నానని మహమూద్ జిన్ చెప్పాడు. ఈ మూవీలో చాలా పార్ట్ గ్రాఫిక్స్ తో ఉంటుందట.