రజినీని వెనక్కి నెట్టిన దీపికా

ఇండియన్ స్క్రీన్ పై భారీమొత్తం లో పారితోషకం తీసుకునే వారిలో మొదటి ప్లేస్ సూపర్ స్టార్ రజినీ కాంత్ దే అని అందరూ చెప్తుంటారు.అనధికారిక లెక్కల ప్రకారం రజినీ ఆ మధ్యన ఓ సినిమాకి సుమారు 60 కోట్లు తీసుకుంటాడని వినికిడి.అయితే ఈ లెక్కలన్నీ కబాలి సినిమాకి ముందు మాట.కబాలి సినిమాకి అంతకు మించిన రెమ్యూనరేషన్ తీసుకున్నాడని టాక్.

అయితే ఇప్పుడు మరొకరు రజినీ రెమ్యూనరేషన్ ని దాటేసారు.అది ఏ బాలీవుడ్ హీరోనో అయితే పెద్ద ఆశ్చర్యం లేదు కానీ రజినీని దాటింది మాత్రం ఓ హీరోయిన్.ఆమె బాలీవుడ్ సుందరాంగి దీపికా పదుకోన్.ఇదేదో కాకిలెక్క అనుకుంటే పొరపాటే.2016వ సంవత్సరంలో ఎక్కువ పారితోషకం తీసుకుంటున్న హీరోయిన్ల జాబితాను ‘ఫోర్బ్స్‌’ పత్రిక వెల్లడించింది.

ఈ జాబితా ప్రకారం దీపికా ప్రపంచం లోనే అత్యధిక పారితోషకం తీసుకునే హీరోయిన్లలో 10 వ స్థానాన్ని దక్కించుకుంది.ఇండియా నుండి ఓ హీరోయిన్ ఈ ఘనత సాధించడం ఇదే మొతటి సారి.ఇంతకీ దీపికా ఎంత తీసుకుంటోందనుకున్నారా.. పది మిలియన్‌ డాలర్ల (దాదాపు 67 కోట్ల రూపాయలు)తో పదవ స్థానం కొట్టేసింది.ఎంతయినా పాప రేంజ్ ఇప్పుడు హాలీవుడ్ కి వెళ్ళింది కదా..అదేనండి విన్ డీజిల్ తో కలిసి XXX సీరియస్ లో నటిస్తోంది దీపికా.అలా మన సూపర్స్టార్ ని వెనక్కి నెట్టిన లేడీ స్టార్ గా దీపికా రెకార్డులకెక్కిందన్నమాట.