రష్మీ అభిమానికి బంపర్ ఆఫర్!

తెలుగు రాష్ట్రాల్లో రష్మీ గురించి తెలియని వాళ్ళుండరేమో ఇప్పుడు.అంతగా పాపులర్ అయిపోయింది అమ్మడు. అటు జబర్దస్త్ కామెడీ ప్రోగ్రాం కి యాంకరింగ్ తో కొంతా, సినిమాల్లో అందాల ఆరబోతతో మరికొంత.ఏదయితేనేం రష్మీ జీవితాన్నే మార్చేసింది జబర్దస్త్ ప్రోగ్రాం.స్టార్ సెలెబ్రిటీ హోదా లో బయటికెళ్తోంది రష్మీ ఇప్పుడు మరి.

వాస్తవానికి రష్మీ ఎప్పుడో తెరంగ్రేటం చేసింది.అడపా దడపా చిన్న చితకా రోల్స్ తో కెరీర్ తొలినాల్లో నెట్టుకొచ్చింది రష్మీ.అయితే జబర్దస్ కామెడీ ప్రోగ్రాం లో యాంకరింగ్ చేసే ఛాన్స్ వచ్చింది..ఇక అంతే..అక్కడినుండి వెనిక్కి తిరిగి చూడలేదు.వరుస పెట్టి టీవీ ఆఫర్స్ రావడం మొదలుపెట్టాయి.

అదంతా ఒకెత్తు అయితే..రష్మీ నటించిన గుంటూరు టాకీస్ అనే సినిమా ఆమె సినిమా కెరీర్ కి సెకండ్ ఇన్నింగ్స్ లా మంచి ఊపునిచ్చిందనే చెప్పాలి.ఆ సినిమాలో రష్మీ అందచందాలు యువతను రష్మీకి బాగా దగ్గరిచేసింది.ఆ సిన్మాతరువాత అనేక మంది నిర్మాతలు రష్మీ డేట్స్ కోసం క్యూ కట్టారని టాక్ కూడా నడిచింది.ఆతరువాత వచ్చిన అంతం,రాణి గారి బంగ్లా సినిమాల్లోనూ రష్మీ అందచందాలు ప్రధానాకర్షణగా నిలిచాయి.

తాజాగా రష్మీ ఓ అభిమానితో చాట్ చేస్తుండగా అభిమాని అడిగిన ప్రశ్నకు ఖంగుతింది..నువ్వు బి గ్రేడే హీరోయిన్ వి అనేసాడట ఆ అభిమాని.అంతటితో ఆగకుండా మంచి సినిమాలు చేయొచ్చుకదా అని సలహా కూడా ఇచ్చాడు పాపం.అంతే రష్మీ కి కోపం కట్టలుతెంచుకుంది.మరి నువ్వే ఓ మంచి సినిమా తియ్యి. అందులో నన్ను హీరోయిన్‌గా పెట్టుకో అంటూ కౌంటర్ తో కూడిన బంపర్ ఆఫర్ ఇచ్చింది.ఆంటే రష్మీ మంచి సినిమాలు చేయడానికి రెడీ గా ఉన్న అందరూ రష్మిని అందాల ఆరబోత యాంగిల్ లోనే చూస్తున్నారు తప్ప రష్మీ తో ఓ మంచి కథా బలమున్న సినిమా ఎవ్వరూ ఆఫర్ చేయడం లేదనేది రష్మీ అసలు బాధ అని అర్థమవుతోంది కదూ.