రాధికాకి మరీ అంత బరితెగింపా?

అచ్చమైన తెలుగమ్మాయిలాల కనిపిస్తుంది చీరకట్టులో ఆ ముద్దుగుమ్మ. కానీ బాలీవుడ్‌లో అయితే ఆమె ఎక్స్‌పోజింగ్‌కి ఆకాశమే హద్దు. నో అబ్జక్షన్స్‌. ఎలాంటి కాస్ట్యూమ్‌కైనా. ఆమె ఎవరో కాదు ఇటీవల ఏకంగా సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ పక్కన ‘కబాలి’ సినిమాలో నటించిన రాధికా ఆప్టే. ఎక్స్‌పోజింగ్‌ విషయంలో ఈ ముద్దుగుమ్మకి ఇంతకుముందే చాలా సార్లు వివాదాలు చుట్టుముట్టాయి. కానీ ఏమాత్రం పట్టించుకోకుండా తన పని తాను చేసుకుని పోతూ ఉంటుంది.

‘కబాలి’లో సినిమా మొత్తం చీరకట్టు, నిండైన బొట్టుతో ఎంతో హుందాతనంగా కనిపించింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్‌లో ‘పర్చెద్‌’ అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో అమ్మడు న్యూడ్‌గా నటించిన ఫోటోలు నెట్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి. అయినా ఈ ముద్దుగుమ్మకి ఏ మాత్రం చీమకుట్టినట్లయినా లేదు. ఆమె మీద వస్తోన్న కామెంట్స్‌ని హాయిగా ఎంజాయ్‌ చేస్తోంది.

అయినా కానీ తన అందానికి పబ్లిఇసటీ ఉండాలంటోంది. ఊరికే అందాల ప్రదర్శన చేస్తే ఏముంటుంది కిక్కు. అందరూ తన అందం గురించి మాట్లాడుకుంటేనే కదా అసలైన కిక్కు అని కూడా అంటోంది ఈ ముద్దుగుమ్మ. ఎవరెన్ని చెప్పినా, తాను మాత్రం మారనంటోంది రాధికా ఆప్టే. సెమీ న్యూడ్‌ ఫొటోలు, మార్ఫింగ్‌ పొటోలు హీరోయిన్లకు కొత్త కాదు. కానీ రాధికా ఆప్టేలా ఎవరూ ఇంత బోల్డ్‌గా ఇండియన్‌ సినిమా స్క్రీన్‌పై కనిపించలేదనడం నిస్సందేహం.