రానాతో కలిసి సందడి చేయబోతున్న నాని

టాలీవుడ్ లో నాచ్యురల్ స్టార్ గా పేరుతెచ్చుకున్న నాని వరుసగా ఆరు సినిమాలు హిట్ కొట్టి డబల్  హ్యాట్రిక్ కొట్టాడు. దీంతో టాలీవుడ్ లో వారసత్వ హీరోలకి సవాల్ విసిరాడు. సినిమా కథల సెలక్షన్ విషయంలో సైతం కుర్ర హీరోలందరూ ఇప్పుడు నాని ని ఆదర్శంగా తీసుకుంటున్నారు. సినిమా సినిమాకి తనలోని నటుడ్ని ఒక్కొక్క మెట్టు పైకెక్కిస్తున్నాడు. ఆ కోవలోనే రకరకాల ప్రయోగాలుకూడా చేస్తున్నాడు. మొన్నామధ్య వచ్చిన ఒకే బంగారం సినిమాకి వాయిస్ ఓవర్ ఇచ్చి ఆ సినిమా తెలుగులో విజయం సాధించటానికి కారణమయ్యాడు.

తాజాగా విడుదలయిన నేను లోకల్ సినిమా తో 50 కోట్లకి పైగా గ్రాస్ కలెక్ట్ చేయటం తో కార్పొరేట్ సంస్థల దృష్టిని సైతం ఆకట్టుకున్నాడు నాని. ఐఫా అవార్డ్స్ కోసం నాని ని యాంకరింగ్ కోసం ఐఫా సంస్థ సంప్రదించిందట కూడా దానికి నాని కూడా ఓకే చేసాడంట. ఇప్పుడు రానా తో కలసి ఐఫా (iifa ) అవార్డ్స్ కి యాంకర్ గా చేయనున్నాడు. గత సంవత్సరం ఈ కార్యక్రమానికి నవదీప్, రెజీనా , అల్లు శిరీష వ్యాఖ్యాతలుగా చేసారు. ఇండియన్ సినిమా ప్రపంచం లో ఐఫా (iifa ) అవార్డ్స్ కి ఒక క్రీజ్ వుంది. బాలీవుడ్ లో ఈ ప్రోగ్రాం కి షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ లాంటి అగ్ర హీరోలు సైతం ఈ ఐఫా అవార్డ్స్ ప్రోగామ్ లో యాంకర్స్ గా చేసారు. ఇప్పుడు అదే కోవలో మన తెలుగు ఐఫా అవార్డ్స్ కోసం నాని, రానా లు కలసి యాంకరింగ్ చేయనున్నారు.