రెజీనా రేంజ్ అంతకు పడిందా!

టాలీవుడ్ బ్యూటీ రెజీనాకు మంచి హిట్స్ ఉన్నా.. అవేవీ భారీ ఆఫర్స్ తెచ్చిపెట్టలేకపోయాయి. ప్రస్తుతం అమ్మడి చేతిలో ఎక్కువ సినిమాలే ఉన్నా.. స్టార్ వాల్యూ ఉన్న ప్రాజెక్ట్ ఒక్కటీ లేదని సమాచారం. చిన్న హీరోలతోనే వరుస సినిమాలు చేస్తున్న ఈ సుందరి.. రీసెంట్ గా కమెడియన్ కం డైరెక్టర్ అవసరాల శ్రీనివాస్ తో జోడీ కట్టేందుకు ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం బాలీవుడ్ సెక్స్ కామెడీ మూవీ ‘హంటర్’కు తెలుగు రీమేక్.

రెజీనా మరో కమెడియన్ తో జోడీ కట్టనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ మూవీలో హీరో కోలీవుడ్ స్టార్ కమెడియన్ సంతానం అట. ఐటీ ఇండస్ట్రీ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం తెరకెక్కుతుందని అంటున్నారు. సంతానం.. కమెడియన్ నుంచి హీరోగా మారాడు. ఇటీవలిగా అతడి సినిమాలు మంచి విజయాలే అందుకున్నాయి. దీంతో అతడితో నటిస్తే.. తన ఖాతాలో మరో సక్సెస్ చేరుతుందని రెజీనా భావిస్తోంది.