వాయిదాపడ్డ ‘కబాలి’ ఆగమనం!

సూపర్ స్టార్ రజనీ కాంత్ అభిమానులకు ఇది నిజంగా షాకింగ్ న్యూస్. తలైవా హీరోగా వస్తొన్న లేటెస్ట్ మూవీ కబాలి విడుదల కోసం వాల్డ్ వైడ్ గా ఉన్న ఆయన ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రజనీని డాన్ గా చూసేందుకు ఉత్సాహంగా ఉన్నారు. ఐతే ఫ్యాన్స్ కు కబాలీ మరో షాక్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. మూవీ రిలీజ్ మరోసారి వాయిదా పడే అవకాశముంది.
తొలుత ఈ సినిమాని జూలై 1న రిలీజ్ చేస్తున్నట్లు యూనిట్ ప్రకటించింది. అయితే అది జూలై 15కి వాయిదా పడింది. కానీ మరోసారి కబాలీ వెనక్కివెళ్లాడని సమాచారం. సినిమాని జూలై 15వ కాకుండ 22న విడుదల చేస్తున్నట్లు యూనిట్ చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో కబాలి కోసం అభిమానులు మరో వారం వెయిట్ చేయక తప్పదు. తొలుత మార్చిలో రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. అయితే షూటింగ్ కంప్లీట్ కాకపోవడంతో మూడునెలలు వాయిదా వేశారు. ఆడియో కూడా రెండుసార్లు వాయిదా పడి ఆఖరికి రిలీజ్ అయింది. మరి సినిమాను రెండోసారి వాయిదా వెేయడానికి కారణాలేంటనేది తెలియలేదు.
రజనీ కాంత్ డాన్ పాత్రలో నటిస్తోన్న ఈ మూవీని పా రంజిత్ డైరెక్ట్  చేస్తున్నారు. కలైపులి ఎస్.థాను నిర్మాతగా వ్యవహిరిస్తుండగా.. సంతోష నారాయణన్ మ్యూజిక్ అందించారు. రజనీ సరసన రాధికా ఆప్టే నటిస్తోంది. ధన్సిక కీలకపాత్ర పోషిస్తోంది.  ఈ మూవీ ఇప్పటికే రూ.200కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.