మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ చేసింది ఐదు సినిమాలు మూడు హిట్లు. రేయ్ సినిమాను వదిలేస్తే తొలి ఐదు సినిమాల్లో తిక్క సినిమా మినహా పిల్లానువ్వులేని జీవితం – సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ – సుప్రీమ్ హిట్లు. ఒక్క తిక్క మాత్రమే డిజాస్టర్. ఐదు సినిమాలకే సపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సాయి నటించిన లేటెస్ట్ మూవీ విన్నర్. మలినేని గోపీచంద్ లాంటి కమర్షియల్ డైరెక్టర్ ,రకుల్‌ప్రీత్‌సింగ్ లాంటి గ్లామరస్ హీరోయిన్, పేరున్న నిర్మాతలు కావడంతో విన్నర్ రూ.30 కోట్ల వరకు ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది.
సినిమా రిలీజ్ అయ్యింది. రొటీన్ కమర్షియల్ మూవీ టాక్ తెచ్చుకుంది. అయినా తొలి రోజు రూ.6.5 కోట్ల షేర్ వచ్చింది. ఫస్ట్ వీకెండ్ మూడు రోజులకు రూ 11 కోట్లు రాబట్టి అందరికి షాక్ ఇచ్చింది. సోమవారం నుంచి విన్నర్ తేలిపోయింది. తొలి మూడు రోజుల్లో రూ.11 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ చిత్రం.. తర్వాతి నాలుగు రోజుల్లో కేవలం రూ.2 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది.
సెకండ్ వీక్‌లోకి ఎంటర్ అయిన విన్నర్ తేలిపోయింది. ఈ వీక్‌లో గుంటూరోడు – కిట్టు ఉన్నాడు జాగ్రత్త – ద్వారక సినిమాలు రిలీజ్ అవ్వడంతో విన్నర్ చాలా సెంటర్లలో లేపేశారు. అది కూడా బీ, సీ సెంటర్లలో..ఇంకేముందు విన్నర్ లాంగ్‌రన్‌లో మహా అయితే రూ. 15-16 కోట్లకు మించి రాబట్టదని అంచనా..అదే జరిగితే విన్నర్ సినిమాకు రూ 12-15 కోట్ల భారీ లాస్ తప్పదు. ఓవరాల్‌గా విన్నర్ సాయి కేరీర్‌లో తిక్క తర్వాత రెండో డిజాస్టర్ ఇచ్చింది.
విన్నర్ ఫస్ట్ వీక్ ఏరియా వైజ్ షేర్:
నైజాం-రూ.3.9 కోట్లు
సీడెడ్-రూ.2.1 కోట్లు
వైజాగ్ -రూ.1.45 కోట్లు
గుంటూరు-రూ.1.02 కోట్లు
కృష్ణా- రూ.79 లక్షలు
వెస్ట్ – రూ.85 లక్షలు
ఈస్ట్ -రూ.1.2 కోట్లు
నెల్లూరు-రూ.44 లక్షలు
కర్ణాటక-రూ.1.05 కోట్లు
యుఎస్- రూ.20 లక్షలు
——————————————–
ఏపీ+తెలంగాణ షేర్ రూ.11.73 కోట్లు
——————————————–
వరల్డ్ వైడ్ షేర్- రూ.13.15 కోట్లు