సరైనోడు బాబు బంగారం ఒక్కటే!

బాబు బంగారం. విక్టరీ వెంకటేష్ లేటెస్ట్ వెంచర్. టైమ్ వస్తే యావరేజ్ సినిమాలు కూడా హిట్టవుతాయి. కొన్ని సంధర్బాల్లో అవి సూపర్ హిట్లుగా మారిపోతాయి. అప్పుడప్పుడూ టాక్ తో సంబంధం లేకుండా కొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్లిపోతూ ఉంటాయి. ఈ సమ్మర్లో వచ్చిన ‘సరైనోడు’ డివైడ్ టాక్ తో మొదలైనా సరే.. భారీ వసూళ్లు సాధించింది. బ్లాక్ బస్టర్ రేంజికి వెళ్లిపోయింది. మార్కెట్లో ఇపుడు ‘బాబు బంగారం’ సినిమా సైతం ఇలాగే అంచనాలకు మించి ఆడేస్తోంది.

ఈ సినిమాకు తొలి రోజు నెగెటివ్ టాక్ వచ్చినా సరే కలెక్షన్లు స్టడీగా ఉన్నాయి. పోటీగా విడుదలైన ‘తిక్క’కు డిజాస్టర్ టాక్ రావడంతో పాటు.. వరుసగా నాలుగు సెలవు దినాలు రావడం వెంకీ-మారుతిల సినిమాకు బాగా కలిసొస్తోంది. తొలి రోజు తర్వాత కూడా వరుసగా మూడు రోజులూ ఈ సినిమాకు మంచి కలెక్షన్లు వచ్చాయి .

సోమవారం ఇండిపెండెన్స్ డే కావడంతో వీకెండ్ డ్రీమ్ రన్ కంటిన్యూ అయింది. చాలా చోట్ల సినిమాకు హౌస్ ఫుల్స్ పడ్డాయి. ఈ సినిమా త్వరలోనే రూ.20 కోట్ల మార్కును దాటబోతున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. వెంకీ కెరీర్లో హైయెస్ట్ గ్రాసర్ అని కూడా చెప్పుకుంటున్నారు. ఐతే ఈ చిత్ర థియేట్రికల్ రైట్స్ రూ.27 కోట్లకు అమ్ముడయ్యాయి. ఆ మేరకు రికవరీ మాత్రం కష్టమే మరి.