సల్లూ కి కోపం తెప్పించిన అమీ డ్రెస్!

క్రీడలకు సంబంధించిన కథాంశాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఇటీవల మంచి విజయాలు అందుకున్న సాలా ఖడూస్, సుల్తాన్ చిత్రాలే అందుకు నిదర్శనం. ఇక ‘ఫ్రీకీ అలీ’ పేరుతో మరో స్పోర్ట్స్ స్టోరీ సెప్టెంబర్ 9న థియేటర్స్‌లో అడుగిడనుంది. ఈ చిత్రాన్ని సల్మాన్ ఖాన్ సమర్పిస్తున్నారు. సొహైల్ ఖాన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో నవాజుద్దీన్ సిద్దికీ, అర్బాజ్ ఖాన్, అమీ జాక్సన్ లు ప్రధాన పాత్రలు పోషించారు.

ఫ్రీకీ ఆలీ రిలీజ్ కు మరో నెల రోజులు మాత్రమే ఉండడంతో ప్రచారం ఊపందుకుంది. రీసెంట్ గా సల్మాన్ కూడా పబ్లిసిటీ బరిలో దిగారు. అర్బాజ్ ఖాన్, సొహైల్‌ ఖాన్ లు ఇద్దరూ సల్మాన్ తమ్ముళ్లు. దీంతో.. వారి కోసం సల్లూ భాయ్ టైమ్ కేటాయిస్తూ.. తనవంతు సాయం అందిస్తున్నారు.

ఇదంతా బాగానే ఉన్న ఓ ప్రమోషన్ ఈవెంట్‌కు హీరోయిన్ అమీ జాక్సన్.. చాలా గ్లామరస్‌గా తయారై వచ్చింది. ఫారిన్‌లో జరిగే ప్రమోషన్లలా ఫీలై అమీ.. ఇంత గ్లామర్ ఒలకబోసింది. అయితే.. సల్మాన్‌కు మాత్రం అమీ అవుట్‌ఫిట్‌ నచ్చలేదట. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత.. ఇలాంటి డ్రస్ వేసుకొచ్చావేంటని.. ఆమెకు చీవాట్లు పెట్టినట్లు బాలీవుడ్ టాక్.