” సింగం -3 ” ఫైనల్ కలెక్షన్స్…లాభలా..! నష్టాలా..!

ఎన్నో వాయిదాల మీద వాయిదాలు ప‌డ్డ సింగం -3 ఎట్ట‌కేల‌కు జ‌న‌వ‌రి చివ‌రి వారంలో తెలుగు, త‌మిళ భాష‌ల్లో భారీ ఎత్తున రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకు సింగం సీరిస్‌లో గ‌త రెండు సినిమాల‌తో పోలిస్తే కాస్త వీక్ అన్న టాక్ వ‌చ్చినా..ఓవ‌రాల్‌గా మాత్రం పాజిటివ్ రివ్యూలు వ‌చ్చాయి. బీ, సీ సెంట‌ర్ల‌లో ఈ సినిమాకు మంచి వ‌సూళ్లే వ‌చ్చాయి.

తెలుగు, త‌మిళ్ లాంగ్వేజెస్‌లో క‌లిపి సింగం 3 తొలి 6 రోజుల‌కే రూ.100 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు సాధించింది. వీకెండ్ త‌ర్వాత సింగం దూకుడు త‌గ్గ‌డంతో సినిమా హిట్ కేట‌గిరిలోకి రాలేదు. ఇక ఓవ‌రాల్‌గా సింగం 3కు తెలుగు, త‌మిళ్‌లో రూ.100 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమాకు బ్రేక్ ఈవెన్ రావాలంటే రూ.150 కోట్ల గ్రాస్ రావాలి. అయితే సింగం 3 బాక్సాఫీస్ ప‌రుగు రూ. 120 కోట్ల గ్రాస్ వ‌ద్దే ఆగిపోయింది.

ఇక తెలుగు రైట్స్ తీసుకున్న మ‌ల్కాపురం శివ‌కుమార్ సింగం 3 రైట్స్ కోసం రూ.18 కోట్లు పెట్టుబ‌డి పెట్టారు. సినిమా చాలాసార్లు వాయిదాలు ప‌డ‌డంతో ఒప్పందం ప్రకారం ఆయ‌న కూడా నిర్మాతకు డబ్బులు ఇవ్వలేదని సమాచారం. ఇక ఈ సినిమా తెలుగులో రూ.12-13 కోట్ల మధ్య షేర్ రాబట్టింది.

తెలుగులో స్వ‌ల్ప నష్టాల‌తో సింగం 3 బ‌య‌ట‌ప‌డింది. ఇక త‌మిళ్లో మాత్రం బ‌య్య‌ర్లు భారీగా మునిగిపోయారు. అక్క‌డ రోజు రోజుకు సూర్య సినిమాకు క్రేజ్ త‌గ్గుతోంది. మార్కెట్ స్టామినా కూడా త‌గ్గుతోంది. ఏదేమైనా సింగం 3 ముందుగా అనుకున్న టైంకు డిసెంబ‌ర్‌లో రిలీజ్ అయితే సినిమా రేంజే వేరుగా ఉండేదని ఎన‌లిస్టులు, ట్రేడ్ వ‌ర్గాలు అభిప్రాయ‌ప‌డుతున్నారు.