2.0 స్టోరీ సెన్సేష‌న‌ల్‌ పాయింట్ అదేనా…!

November 4, 2018 at 5:26 pm

విభిన్న చిత్రాల‌తో సంచ‌ల‌నం సృష్టించే ద‌ర్శ‌కుడు శంక‌ర్ యూనివ‌ర్స‌టీ నుంచి వ‌స్తున్న మ‌రో సెన్సేష‌న‌ల్ మూవీ 2.0- గతంలో ఎన్నో చిత్రాల‌ను తీసిన శంక‌ర్ ఎప్ప‌టిక‌ప్పుడు త‌న వైవిధ్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తూ.. ప్రేక్ష‌కుల‌ను మంత్ర ము గ్ధుల‌ను చే స్తూనే ఉన్నాడు. భార‌తీయుడు మొద‌లుకుని.. రోబో వ‌ర‌కు ఆయ‌న తీసిన ప్ర‌తి చిత్రానికీ విమ‌ర్శ‌కుల నుం చి సైతం ప్ర శంస‌లు వ‌చ్చాయి. ఈ ప‌రంప‌ర‌లో ర‌జ‌నీ, ఐశ్వ‌ర్యారాయ్ క‌ల‌క‌యిలో వ‌చ్చిన రోబో చిత్రం మ‌రింత సంచ ల‌నం సృష్టిం చింది. ఇక‌, ఇప్పుడు ఈ సిరీస్‌లోనే వ‌స్తున్న మ‌రో అద్భుత మెస్మ‌రైజింగ్ మూవీ 2.0! ఏదో ఒక స మ‌స్యను తీసుకుని ప్ర జ‌ల‌కు అర్ధ‌మ‌య్యేలా త‌న‌దైన శైలిలో ప్ర‌జెంట్ చేసే ద‌ర్శ‌కుడిగా శంక‌ర్‌కు పేరుంది.

qw

ప్ర‌స్తుతం తుది మెరుగులు దిద్దుకుంటున్న ఈ 2.0 మూవీకి సంబంధించి రెండు నిమిషాల ట్రైల‌ర్ వ‌చ్చేసింది. దీనికి వ్యూస్ బాగానే ప‌డ్డాయి. అయితే, ఈ ట్రైల‌ర్‌కు.. గ‌తంలో వ‌చ్చిన రోబో మూవీకి మ‌ధ్య కొన్ని సారూప్య‌త‌లు ఉన్నట్టుగా తెలుస్తోంది. మనిషిని ప్రేమించిన మరమనిషి భావోద్వేగాలే రోబోకి హైలెట్. అలాంటి అంశాలే రోబో 2.0 లో కూడా కనిపిస్తున్నాయి. అయితే, ఇక్క‌డ ఇప్పుడు స‌మాజాన్ని శాసిస్తున్న సెల్ ఫోన్ల‌ను క‌ధా వ‌స్తువుగా తీసుకున్నాడు శంక‌ర్‌. అంటే.. సెల్‌ఫోన్లు స‌మాజానికి ఎంత హానిక‌రంగా మారాయో.. చెప్పాల‌ని శంక‌ర్ భావించిన‌ట్టు స్ప‌ష్టంగా తెలుస్తోంది. టీజర్ క్లైమాక్స్ లో రోబో రజనీతో తలపడే అక్షయ్ కుమార్ సీన్ ని జాగ్రత్తగా గమనిస్తే.. అందులో మరో రజినీ ఫేస్ ఉంటుంది.

eqeq

రోబోని ఎదుర్కోడానికి విలన్ అక్షయ్ రజనీకాంత్ రూపంలోకి మారిపోయి మైండ్ గేమ్ ఆడతాడనమాట. సినిమాకు టర్నింగ్ పాయింట్ ఇదే అనే చర్చ జోరుగా సాగుతోంది. అప్పటి వరకు పక్షిరాజుపై పైచేయి సాధించిన చిట్టీ.. రజనీ రూపంలోకి మారిన తన ప్రత్యర్థిని గుర్తు పట్టలేకుండా కథ సాగుతుందన్నమాట. ప్రీ క్లైమాక్స్ నుంచి మొదలయ్యే ఈ సస్పెన్స్ ఎలిమెంట్ సినిమాకి ప్రధానాకర్షణ అని తెలుస్తోంది. రోబో సినిమాలో రజనీ వర్సెస్ రజనీ సన్నివేశాలు ఎంతగా ఆకట్టుకున్నాయో.. 2.0లో కూడా ఇదే తరహా సన్నివేశాలు ప్రేక్షకుల్ని కట్టిపడేసేలా ఉంటాయ‌ని ట్రైల‌ర్‌ను బ‌ట్టే రుజువు అవుతోంది. మొత్తానికి అంచ‌నాల‌కు భిన్నంగా ఈ మూవీ దూసుకుపోవ‌డం ఖాయ‌మ‌ని విమ‌ర్శ‌కులు చెబుతున్నారు.

2.0 స్టోరీ సెన్సేష‌న‌ల్‌ పాయింట్ అదేనా…!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share