రోబో 2 .౦ టీజర్…చిట్టి రీలోడెడ్!

November 3, 2018 at 1:20 pm

ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది రజనీ అభిమానులు ఎదురు చూస్తున్న ఇండియాస్ మోస్ట్ కాస్ట్ ఫిలిం 2.0 ట్రైలర్ అట్టహాసంగా చెన్నైలో అశేష అభిమానుల మధ్య రిలీజ్ అయ్యింది..రెండు నిమిషాల పాటు ఉన్న ఈ ట్రైలర్లో శంకర్ తన టెక్నీకల్ మాయాజాలంతో వేరే లోకంలోకి తీసుకుని వెళ్ళాడని అనిపిస్తుంది..అయితే ఇక్కడ మరొక విషయం ఏమిటంటే ఈ  ట్రైలర్ చూసిన వారికి ఈ సినిమా కధ దాదాపు అర్థమయ్యే రీతిలో ఉంది.21111
 
ఇదిలాఉంటే ఈ సారి శంకర్ ఈసారి సెల్ ఫోన్ ని విలన్కు ఆయుధంగా చేశాడు..చూస్తుంటే సెల్ ఫోన్ ప్రస్తుత పరిస్థితిలో అందరికి విలన్ లాంటిదే. అయితే ఈ యాంగిల్ బేస్ చేసుకుని శంకర్ ప్రపంచంలో సెల్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరు హంతకులే అని విచిత్రమైన కాకి లాంటి గద్ద పోలికలున్న అక్షయ్ కుమార్ పాత్ర ద్వారా చెప్పించిన శంకర్ కథలో మెయిన్ పాయింట్ ని సెల్ ఫోన్ టెక్నాలజీ ద్వారానే రాసుకున్నట్టు అర్థమవుతోంది.
 
అయితే ఈ అమీ జాక్సన్ రోబోను రూపొందించే క్రమంలో రజనికి అసిస్టెంట్ గా కనిపించింది. అతిపెద్దదైన భారీ ఆకారమ ఉన్న ఒక పక్షి ఆ పక్షి కూడా సెల్ ఫోన్ లతో నిండిపోయింది..అయితే ఆ పక్షి చేస్తున్న ప్రకంపనలు భీభత్సం రజనీ టార్గెట్ గా ఆ పక్షి వెంటపడటం దాంతో జనాలుపరుగులు తీయడం అంతా ఎదో ఒక వింత లోకంలో ఉన్నట్లుగా అనిపించింది…ఈ ట్రైలర్ మొత్తంలో చూస్తె అసలు సెల్ ఫోన్ అనేది ఎవరి దగ్గరా లేకుండా చేయడమే ఆ పక్షి ప్రయత్నంగా ఉన్నట్లుగా కనిపిస్తోంది..ఇక ఈ సినిమాలో రెహమాన్ మ్యూజిక్ హాలీవుడ్ స్థాయిలో ఉంది.  త్రీడి గ్లాసెస్ తో ధియేటర్ లో కూర్చుని ఈ సినిమాని చూస్తె సీట్లలోనుంచీ పై పైకి గెంతులు వేయడం ఖామని అంటున్నారు..మొత్తానికి 29న విడుదలకంటే ఎప్పుడెప్పుడు వస్తుందా అనేవిధంగా అభిమానులు వేచి చూసే విధంగా ఈ ట్రైలర్ ఉంది.

రోబో 2 .౦ టీజర్…చిట్టి రీలోడెడ్!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share