2017లో 13 మెగా ఫ్యామిలీ మూవీలు

మెగా ఫ్యామిలీ నుంచి వ‌చ్చే ఒక్క మూవీకే అభిమానులు ఎగిరి గంతేస్తారు. అలాంటిది 2017లో మెగా ఫ్యామిలీ హీరోల‌కు చెందిన 13 సినిమాలు రిలీజ్ కానున్నాయ‌న్న వార్త‌లు అభిమానుల‌ను ఉక్కిరిబిక్కిరి చేయ‌నున్నాయి. ముఖ్యంగా మెగాస్టార్ చిరు ప్ర‌తిష్టాత్మ్కంగా న‌టిస్తున్న 150వ మూవీ ఖైదీ నెం.150 సంక్రాంతి బ‌రిలో సంద‌డి చేయనుంది. దీనిని విభిన్నమైన యాంగిల్‌లో డైరెక్ట‌ర్ వీవీ ప్లాన్ చేశాడు. దీంతో సెట్స్ మీద‌కి వెళ్లిన ఫ‌స్ట్ డే నుంచి ఈ మూవీ సంచ‌నాలు సృష్టిస్తూనే ఉంది.   ప‌దేళ్ళ త‌ర్వాత చిరంజీవి సోలో హీరోగా న‌టిస్తోన్న సినిమా ఇదే కావ‌డంతో అభిమానులు పండ‌గ చేసుకుంటున్నారు.

పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ లోనూ అన్న‌య్య ఆల్ టైమ్ రికార్డ్స్ సెట్ చేస్తున్నాడు.  ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా 2017లో రెండు సినిమాలు.. కుదిర్తే మూడో సినిమా కూడా తీసుకురానున్నాడు. డాలితో చేస్తోన్న కాట‌మ‌రాయుడు మార్చ్ 31న విడుద‌ల కానుంద‌ని స‌మాచారం. నవంబర్ నుంచే త్రివిక్ర‌మ్ సినిమా కూడా మొద‌లు కానుంది. ఇది కూడా వ‌చ్చే ఏడాది విడుద‌ల చేయాల‌ని ప్లాన్‌లో ఉన్నారు. ఇక ఇటీవ‌లే జిల్లా డైరెక్ట‌ర్‌ నీష‌న్ తోనూ ఓ సినిమా క‌మిట‌య్యాడు ప‌వ‌న్. ఈ మూవీ కూడా 2017లోనే రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. వ‌ర‌స విజ‌యాల‌తో దూసుకుపోతున్న బ‌న్నీ వ‌చ్చే ఏడాది రెండు సినిమాలు ప్లాన్ చేశాడు.

హ‌రీష్ శంక‌ర్ తో క‌మిటైన డిజే వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్ కు విడుద‌ల కానుంది. లింగుస్వామితో కమిటైన బై లింగువ‌ల్ మూవీ కూడా వ‌చ్చే ఏడాది చివ‌ర్లో విడుద‌ల కానుంది. రామ్ చ‌ర‌ణ్ మూవీ కూడా సంక్రాంతికి ప్లాన్ చేస్తున్నారు. సాయిధ‌రంతేజ్ గోపీచంద్ మ‌లినేని విన్న‌ర్ పాటు మ‌రో సినిమా కూడా రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాడు. వ‌రుణ్ తేజ్ శీనువైట్ల మిస్ట‌ర్.. శేఖ‌ర్ క‌మ్ముల ఫిదా షూటింగ్స్ తో బిజీగా ఉన్నాడు. ఈ రెండూ వ‌చ్చే ఏడాది రానున్నాయి. ఇక‌, శిరీష్ కూడా ఓ మూవీతో 2017లో అల‌రించేందుకు రెడీ అవుతున్నాడు. సో.. మెగా అభిమానుల‌కు 2017లో పండ‌గే పండ‌గ‌న్న‌మాట‌!