50వేల లీటర్ల పాలు, 20 లక్షలు:కబాలి రా!

తలైవా..సూపర్ స్టార్..రజినీకాంత్ సినిమా విడుదలవుతుంది అంటే చాలు దక్షిణాది రాష్ట్రాల్లో పండుగ వాతావరణమే.మరీ ముక్యంగా తమిళనాడు లో అయితే అభిమానులకి రజిని సినిమా వస్తోందంటే చాలు పోస్టర్లు,కటౌట్స్ పూలదండలు ఒకటే హంగామా.అంత కాకుండా రజిని కటౌట్లకి పాలాభిషేకం చేసే అలవాటు ఆనవాయితీగా వస్తోంది.అప్పుడెప్పుడో 90 ల్లో రజిని నటించిన అన్నామలై చిత్రం..తెలుగులో వెంకటేష్ నటించిన కొండపల్లి రాజా సినిమాలో రజిని పాలవాడిగా కనిపించాడు.కట్ చేస్తే అప్పటినుండి సూపర్ స్టార్ సినిమా ఏది రిలీజ్ అయినా సరే అభిమానులు పాలాభిషేకం తో వరద పారిస్తూ వస్తున్నారు.

ఇక లేటెస్ట్ గా రాబోతున్న కబాలి సినిమా ..కాదు కాదు అదొక బ్రాండ్ అయిపోయి రాబోతున్న వేళ, అభిమానులు ఎన్ని వేల లీటర్ల పాలతో తలైవాని తడప బోతున్నారనే చర్చసాగుతోంది.జూలై 22న కబాలి విడుదల రోజు రూ. 20 లక్షలు విలువచేసే 50వేల లీటర్ల పాలు కటౌట్ల అభిషేకాని కోసం వృథా అయ్యే అవకాశముందని పాల వ్యాపారుల సంఘం తెలిపింది.

అయితే తమిళనాడు పాలవ్యాపారుల సంఘం మాత్రం పాలను వృధా చెయ్యొద్దని తలైవా అభిమానులకి విజ్ఞప్తి చేస్తోంది.సేవ కార్యక్రమాల్లో ఎప్పుడు ముందుండే రజిని అభిమానులు ఈ ఒక్క విషయంలో తమ అలవాటు మార్చుకోవాలని కోరుతున్నారు. తమిళనాడులో 15శాతం మంది ప్రజలకు ప్రతిరోజూ పాలుకొనేందుకు కూడా స్థోమత లేదని ఓ సర్వే చెబుతోంది. చూద్దాం రజిని అభిమానులు ఈ విన్నపాన్ని ఏమేరకు స్వీకరిస్తారో.