‘అదుగో’ట్రైలర్ వచ్చేసింది!

September 12, 2018 at 3:41 pm

ఇప్పటి వరకు సినిమా ఇండస్ట్రీలో గ్రాఫిక్ తో ఎన్నో మాయలు, మంత్రాలు చూశాం. లేనిది ఉన్నట్లు..ఉన్నది లేనట్లు గ్రాఫిక్ మాయాజాలంలో చూపిస్తుంటారు. ఒకప్పుడు అంతరించి పోయాయి అనుకున్న డైనోసార్స్ ని మన కళ్లముందు ఉంచారు ప్రముఖ దర్శకలు స్టీవెన్ స్పిల్ బర్గ్. ఇక తెలుగు లో అయితే పాత సినిమాల్లో విఠలాచార్య కొన్ని భయంకరమైన జంతువులను నిజమైన వాటిగా చూపించి భయపెట్టేవాడు..వాటితో హీరోలు యుద్దం చేసి గెలిచేవారు. ఇలా సినిమాలో మనుషుల కన్నా జంతువులతో చేసిన ప్రయోగాలు బాగా సక్సెస్ అయ్యాయి.

అయితే తెలుగు లో ఎప్పుడూ మూస పద్దతిలోనే హీరో, హీరోయిన్, విలన్ కొంత కామెడీ, ట్రాజెడీ ఫైట్ సీన్ తో క్లయిమాక్స్..ఇలా సాగుతూన్న సమయంలో ఎస్ ఎస్ రాజమౌళి ‘ఈగ’లాంటి సినిమా తీసి హీరో అవసరం లేదు..అని గ్రాఫిక్ మాయ చేశారు. అప్పటి నుంచి తెలుగు లో ప్రయోగాలపై ఎక్కువ ఫోకస్ పెట్టడం మొదలు పెట్టారు దర్శకులు. ఇండస్ట్రీలో ‘అల్లరి’ సినిమాతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చారు రవిబాబు. వింత వింత కాన్సెప్ట్ లకు పెట్టింది పెరైన నటుడు కమ్ డైరెక్టర్ రవిబాబు తాజాగా పంది పిల్ల ప్రధాన పాత్రలో ‘అదుగో’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

సాధారణంగా హాలీవుడ్ లో జంతువులు మాట్లాడటం..ఆడటం..పాడటం..ఫైట్స్ చేయడం లాంటివి చూస్తూనే ఉన్నాం. తాజాగా ఇప్పుడు రవిబాబు ‘అదుగో’ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. ఇండియా లోనే ఫస్ట్ లైవ్ యాక్షన్ 3D టెక్నాలజీతో తెరకెక్కించిన సినిమా అని మేకర్స్ చెప్తున్నారు. ఇక విజువల్ ఎఫెక్ట్స్ వల్లే పోస్ట్ ప్రొడక్షన్ రెండేళ్ళు తీసుకుందట. అయితే లవ్ – ఎమోషన్స్ – కామెడీ ఫైట్స్ అన్నీ ఎలిమెంట్స్ చూపించారు..కానీ పెద్దగా ఎలివేట్ అయ్యేలా కనిపించడం లేదని టాక్ వినిపిస్తుంది. అయితే ఈ మద్య యూత్ లిప్ లాక్ సీన్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న విషయం తెలిసిందే.

మరి రవిబాబు ‘అదుగో’ సినిమాతో ఎలా అలరించబోతాడు అన్న సందేహాలు కలుగుతున్నాయి. కాకపోతే..ఈ సినిమా చిన్నపిల్లలకు కనెక్ట్ అవుతుందేమో చూడాలి. ఇక మొత్తం ట్రైలర్ లో ఒకే ఒక ఇంట్రెస్టింగ్ డైలాగ్ రాజేంద్ర ప్రసాద్ వాయిస్ లో చెప్పిన “ఒరేయ్ పందీ.. మనిషిలా మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లు చెప్పించుకుంటావురా..! అన్నది మాత్రమే వినిపిస్తుంది.

‘అదుగో’ట్రైలర్ వచ్చేసింది!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share