మెగాస్టార్ చిరంజీవికి హీరోయిన్ సెట్ చేయడం చాలా కష్టంగానే ఉంది. చిరు ఖైదీ నెంబర్ 150లో హీరోయిన్ కోసం ఎంతోమందిని అన్వేషించి చివరకు చిరు ఫ్యామిలీలో చెర్రీ, పవన్, బన్నీ పక్కన ఆడేసి పాడేసిన కాజల్ అగర్వాల్‌ను ఎంపిక చేశారు. అది కూడా ఆమెకు ఏకంగా రూ.2 కోట్లు ఇచ్చుకోవాల్సి వచ్చింది.
ఇక ఇప్పుడు చిరు 151వ సినిమా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమాలో చిరుకు హీరోయిన్ సెట్ చేయడం కూడా చిత్రయూనిట్‌కు పెద్ద తలనొప్పిగా మారిందట. ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ.. తమిళ భాషల్లోనూ తెరకెక్కబోతోంది. దీంతో మూడు భాషలకు సెట్ అయ్యేలా నేషనల్ క్రేజ్ ఉన్న హీరోయిన్ను తీసుకోవాలని చిరు, చెర్రీ, డైరెక్టర్ సురేందర్‌రెడ్డి భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే వారు ఇప్పటికే బాలీవుడ్ హీరోయిన్లు ప్రియాంకా చోప్రా, దీపికా పడుకొనే పేర్లు పరిశీలించి చివరకు సురేందర్‌రెడ్డి ద్వారా ఐశ్వర్యారాయ్‌ను అప్రోచ్ చేయించారట. చిరు పక్కన నటించాలంటే రూ. 9 కోట్లు ఇవ్వాలని ఐష్ చెప్పిందట. ఈ రేటు విన్న చిరు, చెర్రీకి దిక్కులు కనపడలేదట. దీంతో సైలెంట్‌గా వాళ్లు ఐష్ పేరును పక్కన పెట్టేయాలని డిసైడ్ అయినట్టు టాక్.