అఖిల్ – చైతు మ‌ధ్య చిచ్చు ఎందుకు..!

January 3, 2018 at 11:13 am

అభిమానులు, వ‌ర్గాలు, సోష‌ల్ మీడియా ఇప్పుడు ఇవే హీరోలు, పార్టీలు, నాయ‌కుల మ‌ధ్య చిచ్చుకు, విబేధాల‌కు ప్ర‌ధాన కార‌ణ‌మ‌వుతున్నాయి. ఓ హీరో అభిమాని ఒకే విష‌యంపై ఒకలా, మ‌రో హీరో అభిమాని మ‌రోలా స్పందిస్తుండ‌డంతో గొడ‌వ‌లు రేగుతున్నాయి. తాజాగా కొంత‌మంది సోష‌ల్ మీడియాలో అక్కినేని అన్న‌ద‌మ్ములు అఖిల్ – చైతు సినిమాల‌ను కంపేరిజ‌న్ చేస్తూ పెడుతోన్న పోస్టులు వారి డివైడ్ చేసి చూపిస్తున్న‌ట్టుగా ఉన్నాయి.

అక్కినేని అఖిల్ హ‌లో మూవీ డిసెంబ‌ర్ 22న రిలీజ్ అయ్యింది. ఈ సినిమాపై ఇప్ప‌ట‌కీ భిన్న స్వ‌రాలే వినిపిస్తున్నాయి. టాక్ బాగున్నా అనుకున్న రేంజ్‌లో వ‌సూళ్లు రాక‌పోవ‌డంతో హ‌లో క‌మ‌ర్షియ‌ల్‌గా ప్లాప్ అయ్యింది. హ‌లో అమెరికాలో ఓ రికార్డు నెల‌కొల్పింద‌ట‌. ఈ రికార్డుతో కొంద‌రు  ‘అన్నను మించిన తమ్ముడు’ అయిపోయాడని సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. 

హ‌లో తెలుగు రాష్ట్రాల్లో అనుకున్న రేంజ్‌లో వ‌సూళ్లు సాధించ‌లేక‌పోయినా ఓవ‌ర్సీస్‌లో మాత్రం ఇప్పటికే 833 వేల డాలర్లు పోగేశాడట. ఇదేమీ పెద్ద రికార్డు కాదు. ఈ సినిమా త్వ‌ర‌లోనే అక్క‌డ వ‌న్ మిలియ‌న్ డాల‌ర్ల మార్క్ క్రాస్ చేస్తుందంటున్నారు. గ‌తంలో చైతు న‌టించిన ప్రేమ‌మ్ అక్క‌డ 829 డాల‌ర్లు వ‌సూలు చేస్తే ఇప్పుడు అఖిల్ ఆ మార్క్ క్రాస్ చేయ‌డంతో అన్న‌ను మించిన త‌మ్ముడు అని కొంద‌రు పోస్టులు పెడుతున్నారు.

ఎవ‌రి పిచ్చి వాళ్ల‌దే అయినా ఈ ఇద్ద‌రి సినిమాల‌ను అప్పుడే పోల్చి చూడ‌డం స‌రికాదు. చైతు కెరీర్ ప‌రంగా మంచి విజ‌యాలే సాధించాడు. అఖిల్ రెండో సినిమాతోనూ స‌రైన క‌మ‌ర్షియ‌ల్ హిట్ అందుకోలేదు. అఖిల్ ఇంకా చాలా ఎత్తుకు ఎద‌గాలి. ఈ నేప‌థ్యంలో అన్న‌ను మించిన త‌మ్ముడు అంటూ పోస్టులు పెట్ట‌డం అభిమానుల‌కు స‌రికాదు.

 

అఖిల్ – చైతు మ‌ధ్య చిచ్చు ఎందుకు..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share