‘హ‌లో’ అఖిల్ ఖాతాలో మ‌రో రికార్డు

December 18, 2017 at 10:22 am
Akhil, Hello, movie,

అక్కినేని న‌వ మ‌న్మ‌థుడు అఖిల్ రెండవ సినిమాగా ‘హలో’ ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. హ‌లో వ‌ర‌ల్డ్‌వైడ్‌గా ఈ నెల 22న థియేట‌ర్ల‌లోకి దిగుతోంది. అఖిల్ తొలి సినిమా ఘోర‌మైన డిజాస్ట‌ర్ కావ‌డంతో హ‌లో సినిమా విష‌యంలో నాగ్ ద‌గ్గ‌రుండి మ‌రీ జాగ్ర‌త్త‌లు తీసుకున్నాడు. విక్ర‌మ్ కె.కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా పోస్ట‌ర్స్‌, టీజ‌ర్లు, ఆడియో అభిమానుల్లో ఆస‌క్తిని పెంచాయి. నాగార్జున ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా భారీ బ‌డ్జెట్‌తో ఈ సినిమాను తెర‌కెక్కించారు. 

ఈ సినిమా ఇప్ప‌టికే ఓవ‌రాల్‌గా రూ.40 కోట్ల పైనే ప్రి రిలీజ్ బిజినెస్ చేసింది. హ‌లో థియేట్రిక‌ల్ రైట్సే రూ.32 కోట్ల‌కు అమ్ముడ‌య్యాయి. అఖిల్ లాంటి కొత్త హీరోకు తొలి సినిమా ప్లాప్ అయినా రెండో సినిమాకు ఈ రేంజ్‌లో బిజినెస్ జ‌ర‌గ‌డం రికార్డే. ఇక తాజాగా హ‌లో శాటిలైట్ రైట్స్ రికార్డు రేటుకు అమ్ముడ‌య్యాయి. 

ఈ సినిమా శాటిలైట్ రైట్స్‌ను ఓ ప్రముఖ ఛానెల్ రూ 5.90 కోట్ల‌కు ద‌క్కించుకుంది. అఖిల్ సినిమా ప్లాప్ అయినా రెండో సినిమాకు రిలీజ్‌కు ముందే ఈ రేంజ్‌లో శాటిలైట్ రేటు ప‌ల‌క‌డం రికార్డుగానే చెప్పుకోవాలి. ఇక అఖిల్ సినిమా శాటిలైట్ రైట్స్ ద‌క్కించుకున్న ఛానెలే హ‌లో శాటిలైట్ రైట్స్ కూడా ద‌క్కించుకున్న‌ట్టు స‌మాచారం. అఖిల్ స‌ర‌స‌న ప్ర‌ముఖ మ‌ళ‌యాళ ద‌ర్శ‌కుడు ప్రియ‌ద‌ర్శ‌న్ – మాజీ హీరోయిన్ లిజి దంప‌తుల కుమార్తె క‌ళ్యాణి హీరోయిన్‌గా ప‌రిచ‌యం అవుతోంది.

 

‘హ‌లో’ అఖిల్ ఖాతాలో మ‌రో రికార్డు
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share