అసలే ఫ్లాపులు…ఈ టైంలో ఈ కిరి కిరిలేంటి అఖిల్

July 11, 2018 at 4:07 pm
Akkineni Akhil, Director venki atluri, BVSN prasad, story editing

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో నాగార్జున వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ మొదటి సినిమా ‘అఖిల్’తో హీరోగా తనను తాను ప్రూఫ్ చేసుకోవడానికి తెగ కష్టపడ్డాడు. కానీ ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. దాంతో లవ్ ట్రాక్ తో విక్రమ్ కుమార్ తో ‘హలో’సినిమాతో మరోసారి అభిమానుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా కూడా కమర్షియాల్ గా హిట్ కాలేదు. ఇప్పుడు మూడో సినిమా ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు.

అలాంటి సినిమాపై ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. సినిమా క్రియేటివ్ క్లాషెష్ తో ఉక్కిరిబిక్కిరవుతోంది. ఒకదశలో మూవీ ఆగిపోతుందేమో అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దర్శకులు వెంకీ అట్లూరి కథా పరంగా చూస్తే అఖిల్ కి నచ్చడంలేదట. తనకు తోచిన మార్పులేవో సూచిస్తున్నాడు. ఆ మార్పులు వెంకీకి నచ్చడంలేదట. దీంతో ఒకే సీన్ ను 2-3 రకాలుగా చేసుకుంటూ పోతున్నారు. ఇక ఫైనల్ గా ఎలా ఎడిటింగ్ చేస్తారు..ఏది ఫైనల్ అవుతుందీ అన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.

అంతే కాదు రెండు రోజుల పాటు అఖిల్ షూటింగ్ కి వెళ్లకపోవడం..కారణం కథలో వెంకీ చేసిన మార్పులే అని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ యూనిట్ లో కీలకమైన పొజిషన్ లో పనిచేస్తున్న ఓ వ్యక్తి మరో వ్యక్తితో చేస్తున్న వాట్సాప్ ఛాటింగ్ ద్వారా ఈ విషయం కాస్తా బయటకు పొక్కింది. ఈసారి గనక అఖిల్ హిట్ కొట్టక పోతే కెరీర్ పీక్ స్టేజ్ లోకి వెళ్లిపోతుందన్న భయంతో అఖిల్ తన కథపై రక రకాల ఆలోచనలు పెడుతున్నట్లు తెలుస్తుంది.

యూనిట్ లో మొదలైన ఈ ముసలం, చివరికి ఎటువైపు దారితీస్తుందో చూడాలి. మరోవైపు వీళ్లిద్దరి కంటే ఎంతో సీనియర్ అయిన ప్రొడ్యూసర్ బీవీఎస్ఎన్ ప్రసాద్ మాత్రం చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నాడట.

అసలే ఫ్లాపులు…ఈ టైంలో ఈ కిరి కిరిలేంటి అఖిల్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share