శ్రీరెడ్డి దెబ్బకు అఖిల్ కూడా…

April 21, 2018 at 10:58 am
Akkineni akhil, movie with ramgopal varma, Sr reddy, cancel
తెలుగు సినిమా ఇండ‌స్ట్రీతో పాటు రాజ‌కీయ వ‌ర్గాల్లో శ్రీరెడ్డి ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది. మీడియాలో అయితే ఆమె ర‌చ్చ‌కు అంతే లేదు. ఇక సంచ‌ల‌నాల‌కే సంచ‌ల‌నం అయిన వివాస్ప‌ద ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ శ్రీరెడ్డి ఇష్యూలో ఎందుకు ఎంట‌ర్ అయ్యాడో కాని ఇది మ‌రింత ర‌చ్చ ర‌చ్చ అవుతోంది. తాజాగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ను శ్రీరెడ్డి బండ బూతులు తిట్ట‌డం వెన‌క ఆర్జీవీ ఉన్నాడ‌ని తెలియ‌డంతో మెగా ఫ్యామిలీయే కాదు మెగా అభిమానులు అగ్గిమీద గుగ్గిల‌మ‌వుతున్నారు.
 
ఇక ఇటీవ‌ల వ‌రుస డిజాస్ట‌ర్ల‌తో ఉన్న ఆర్జీవీ ప్ర‌స్తుతం నాగార్జున‌తో ఆఫీస‌ర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు మంచి బ‌జ్ లేదు. బిజినెస్ కూడా స‌రిగా జ‌ర‌గ‌డం లేదు.  మే 25న రిలీజ్ చేస్తున్న‌ట్టు డేట్ కూడా ఫిక్స్ చేశారు. ఈ సినిమా త‌ర్వాత వ‌ర్మ అఖిల్‌తో సినిమా చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే ఇప్పుడు ఆర్జీవీ పెద్ద కాంట్ర‌వ‌ర్సీలో చిక్కుకోవ‌డంతో నాగ్ వ‌ర్మ‌తో సినిమా చేసే సాహ‌సం చేయ‌డ‌ని తెలుస్తోంది.
 
అఖిల్ కెరీర్ ను నాగ్ ఆచితూచి జాగ్రత్తగా బిల్డ్ చేసుకుంటూ వస్తున్నాడు. ఎంత బాగా ప్లాన్ చేసినా వినాయ‌క్‌తో తీసిన డెబ్యూ మూవీ అఖిల్‌, విక్ర‌మ్ కుమార్ డైరెక్ష‌న్‌లో తీసిన హ‌లో రెండూ డిజాస్ట‌ర్ అయ్యాయి. ఇప్పుడు సినిమాల‌పై కాన్‌సంట్రేష‌న్ చేయ‌కుండా వివాదాల‌తో కాల‌క్షేపం చేస్తోన్న వ‌ర్మ చేతుల్లో అఖిల్‌ను పెట్టి రిస్క్ చేసేందుకు నాగ్ సాహ‌సం చేసేందుకు ఇష్ట‌ప‌డ‌డం లేద‌ట‌.
 
వ‌ర్మ అస‌లే కాంట్ర‌వ‌ర్సీ అయినా తాజాగా శ్రీరెడ్డితో పవ‌న్‌ను టార్గెట్ చేయించ‌డంతో వ‌ర్మ‌తో సినిమా చేసేందుకు అఖిల్ సైతం అంత సుముఖంగా లేడ‌ట‌. వాస్త‌వానికి అఖిల్ ఆర్జీవీతో పాటు తొలిప్రేమ ఫేం వెంకీ అట్లూరి డైరెక్షన్ లో కూడా ఓ సినిమా చేయడానికి ఓకే చెప్పాడు. ఏదేమైనా ఒక్కసారిగా వివాదంలోకి వ‌చ్చిన శ్రీరెడ్డి ఇన్‌డైరెక్టుగా అఖిల్ – వ‌ర్మ ప్రాజెక్టు క్యాన్సిల్‌కు కార‌ణ‌మైంది.
sr-reddy-rgv collage
శ్రీరెడ్డి దెబ్బకు అఖిల్ కూడా…
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share