రెండు ప్లాపులిచ్చిన అఖిల్ రేటు అన్ని కోట్లా….!

March 19, 2018 at 11:58 am
Akkineni Akhil, Remuneration, two disaster movies

టాలీవుడ్‌లో క్రేజ్ ఉన్న అక్కినేని వంశం నుంచి మూడో త‌రం హీరోగా ఎంట్రీ ఇచ్చాడు కింగ్ నాగార్జున త‌న‌యుడు అక్కినేని అఖిల్‌. భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన అఖిల్ డెబ్యూ మూవీ వేసిన దెబ్బ‌కు అఖిల్‌, నాగార్జున‌, డైరెక్ట‌ర్ వినాయ‌క్‌, నిర్మాత నితిన్ కోలుకునేందుకు చాలా రోజులే ప‌ట్టింది. ఆ త‌ర్వాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్న అఖిల్ త‌న సొంత బ్యాన‌ర్‌లో విక్ర‌మ్ కె.కుమార్ డైరెక్ష‌న్‌లో హ‌లో సినిమా చేశాడు.

 

హ‌లోకు రివ్యూలు పాజిటివ్‌గానే వ‌చ్చాయి. అయితే బ‌డ్జెట్ ఓవ‌ర్ కావ‌డంతో పాటు అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ కాలేదు. దీంతో సేమ్ సీన్ రిపీట్‌. హ‌లో కూడా డిజాస్ట‌రే. రెండు సినిమాల‌కు భారీ న‌ష్టాలు త‌ప్ప‌లేదు. రెండు సినిమాల విష‌యంలో బ‌డ్జెట్ ఓవ‌ర్ కావ‌డం కూడా దెబ్బేసింది. ఇక హ‌లో త‌ర్వాత మూడో సినిమాకు రెడీ అవుతోన్న అఖిల్ చెప్పిన రేటుతో ఆ సినిమా నిర్మాత‌కు చుక్క‌లు క‌న‌ప‌డ్డాయ‌ట‌.

 

తొలిప్రేమతో తోలి హిట్ అందుకున్న వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్ తన మూడో ప్రాజెక్ట్ ని చేయబోతున్నట్లుగా వార్తలొస్తున్నాయి. కాదు దాదాపు ఈ వార్త కన్ఫర్మ్ అంటున్నారు. అగ్ర నిర్మాత భోగ‌వ‌ల్లి ప్ర‌సాద్ ఈ క్రేజీ ప్రాజెక్టును నిర్మించాల‌ని చూస్తున్నారు. ఈ సినిమాలో న‌టించేందుకు భోగ‌వల్లికి అఖిల్ చెప్పిన రేటు రూ.10 కోట్లు అట‌.

 

అఖిల్ రేటు విని భోగ‌వ‌ల్లి షాక్ అయ్యార‌ట‌. అఖిల్ చేసిన‌వే రెండు సినిమాలు. పోనీ అఖిల్‌కు మార్కెట్ కూడా లేదు. రెండూ డిజాస్ట‌ర్లు. అంద‌రికి భారీ న‌ష్టాలు మిగిల్చాయి. అఖిల్ రెండు సినిమాలు పెద్దగా ఆడకపోయినా యూత్‌లో మాత్రం అఖిల్‌కు కాస్తో కూస్తో క్రేజ్ ఉంది. ఒకే ఒక్క హిట్ ప‌డితే అఖిల్ ట్రాక్‌లోకి వ‌స్తాడు. మ‌రి అఖిల్ మూడో ప్ర‌య‌త్నంలో అయినా హిట్ కొడ‌తాడేమో ?  చూద్దాం.

 

రెండు ప్లాపులిచ్చిన అఖిల్ రేటు అన్ని కోట్లా….!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share