అక్కినేని ఇమేజ్ ను కాపాడేది ఆ ఒక్కరేనా…

June 4, 2018 at 3:27 pm
Akkineni family, Nagarjuna, Samantha, akhil, Naga chaitanya

ఒకే కుటుంబంలో ముగ్గురు హీరోలు ఉన్నా ఒక్క‌రూ.. హిట్ కొట్ట‌లేక చ‌తికిల‌పడిపోతున్నారు. బాక్సాఫీస్ ముందు బొక్క‌బోర్లాప‌డుతున్నారు. ర‌క‌ర‌కాల క‌థ‌లు ప్ర‌య‌త్నిస్తున్నా.. కొత్త కాంబినేష‌న్ల‌లో సినిమాలు చేస్తున్నా.. అభిమానుల‌ను మాత్రం అల‌రించ‌లేక‌పోతున్నారు. ఇండస్ట్రీకి ఎన్నో హిట్లు ఇచ్చిన కుటుంబం.. ఇప్పుడు హిట్ అనే మాట కోసం ప‌రిత‌పిస్తోంది. అక్కినేని కుటుంబంలో సీనియ‌ర్ న‌టుడు నాగార్జున‌, ఆయ‌న కొడుకులు నాగ‌చైత‌న్య‌, యువ హీరో అఖిల్ ఉన్నా.. డిఫ‌రెంట్ స‌బ్జెక్టుల‌తో వ‌రుస‌గా సినిమాలు చేస్తున్నా హిట్లు మాత్రం రావ‌డం లేదు! కానీ అక్కినేని ఫ్యామిలీని కాపాడుకుంటూ వ‌స్తోంది నాగార్జున కోడ‌లు స‌మంత‌.

నాగ చైత‌న్యతో పెళ్లి అయిన త‌ర్వాత‌.. ఆమె న‌టించిన మూడు సినిమాలు విడుద‌లై బాక్సాఫీస్ ముందు క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపించాయి కురిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం అక్కినేని ఫ్యామిలీకి విక్ట‌రీ ఐకాన్‌గా మారిపోయింది శామ్‌! రంగ‌స్థ‌లం.. మ‌హాన‌టి.. అభిమ‌న్యుడు.. ఈ మూడు చిత్రాల్లోనూ డిఫ‌రెంట్ పాత్ర‌ల్లో అద‌ర‌గొట్టింది స‌మంత‌. పెళ్లి త‌ర్వాత విడుద‌లైన ఈ సినిమాలు మంచి టాక్ సంపాదించుకున్నాయి. అలాగే పాత్ర‌కు కూడా మంచి పేరు కూడా తెచ్చిపెట్టాయి. పెళ్లికి ముందు గ్లామ‌ర్ రోల్స్ చేసిన స‌మంత‌.. త‌ర్వాత రూటు మార్చారు. నాయికా ప్రాధాన్య‌మున్న పాత్ర‌ల‌ను సెలెక్టివ్‌గా ఎంచుకుంటోంది. రాజుగారి గది-2లో ఆమె పాత్ర చిన్న‌దే అయినా.. ఒప్పుకుని సినిమాను ముందుండి న‌డిపించింది.

అలాగే ఇక రంగ‌స్థలంలోనూ ప‌ల్లెటూరి అమ్మాయిలా క‌నిపించి.. న‌ట‌న‌తో అంద‌రినీ మెప్పించింది. కీర్తి సురేష్ లీడ్ రోల్ చేసిన మ‌హాన‌టిలో.. హీరోయిన్ కాక‌పోయినా కేరెక్ట‌ర్ న‌చ్చి చిన్న కేరెక్ట‌ర్ అయినా భేష‌జాల‌కు పోకుండా చేసి.. మంచి పేరు తెచ్చుకుంది. ఇవి రెండూ సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నాయి. ఇటీవ‌ల విడుద‌లైన అభిమ‌న్యుడులోనూ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. ఇదీ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది.

ఇక అక్కినేని హీరోల ప‌రిస్థితి గంద‌రగోళంగా మారింది. చాలా ఏళ్ల త‌ర్వాత తాను ఇండస్ట్రీకి ప‌రిచ‌యం చేసిన‌ రామ్‌గోపాల్ వ‌ర్మ‌తో నాగ్ చేసిన సినిమా ఆఫీస‌ర్‌. ఎన్నో అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద బోల్లా కొట్టింది. అభిమానుల‌ను తీవ్రంగా నిరాశ‌ప‌రిచింది. ఇక నాగ‌చైత‌న్య కూడా హిట్ కోసం వేచిచూస్తున్నాడు. అన్ని ర‌కాల ఎమోషన్స్ ఉన్న కేరెక్ట‌ర్లను ట్రై చేస్తున్నా అవ‌న్నీ బెడిసికొడుతున్నాయి. ఇండ‌స్ట్రీకి వ‌చ్చి ఇన్నేళ్ల‌యినా స్టార్ హీరోగా ఇంకా ఎలివేట్ కాలేక‌పోయాడ‌నే గుస‌గుస‌లు లేక‌పోలేదు.

ఇక అఖిల్‌దీ ఇదే దారి. మొదటి సినిమా `అఖిల్‌` షాక్ నుంచి కోలుకుని `హ‌లో` అని ప‌ల‌క‌రించినా.. అది గ‌ట్టిగా వినిపించ‌లేదు. దీంతో ఆచితూచి అడుగులు వేస్తూ కెరీర్‌ను ఇప్పుడిప్పుడే జాగ్ర‌త్త‌గా బిల్డ‌ప్ చేసుకుంటున్నాడు. మరి ఈ స‌మ‌యంలో స‌మంత‌నే.. అక్కినేని కుటుంబాన్ని ఆదుకుంటోంద‌నడంలో సందేహం లేదుక‌దా!

అక్కినేని ఇమేజ్ ను కాపాడేది ఆ ఒక్కరేనా…
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share