వేధింపుల‌పై అక్కినేని హీరో ఆవేద‌న‌

June 7, 2018 at 3:08 pm
Akkineni Family, Sushanth, social Media, Comments

టాలీవుడ్‌లో దిగ్గ‌జ ఫ్యామిలీల్లో ఒక‌టి అయిన అక్కినేని కుటుంబం నుంచి టాలీవుడ్‌కు పరిచయమైన హీరో సుశాంత్‌ మంచి హిట్‌ కోసం చానాళ్లుగా ఎదురుచూస్తున్నారు. కొద్ది రోజులుగా సుశాంత్‌కు స‌రైన హిట్ లేదు. సుశాంత్ ఒక్కో సినిమాకు ఏకంగా రెండేళ్లు గ్యాప్ తీసుకుంటున్నాడు. సుశాంత్ చివ‌రి సినిమా ఆటాడుకుందాం రా అట్ట‌ర్‌ప్లాప్ అయ్యింది.

ప్ర‌స్తుతం సుశాంత్ ఆశ‌లు అన్నీ త‌న తాజా సినిమా చిల‌సౌ మీదే ఉన్నాయి. దర్శకుడిగా మారిన నటుడు రాహుల్‌ రవీంద్రతో సుశాంత్‌ ‘చిలసౌ’అనే సినిమా చేశారు. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ఈ సినిమా టీజ‌ర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వ‌స్తోంది. ఈ సినిమాను త్వ‌ర‌గా రిలీజ్ చేయాల‌ని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంటే… ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాల‌ని సుశాంత్ క‌సితో ఉన్నాడు.

ఇదిలా ఉంటే సుశాంత్ మ‌రో కొత్త సినిమా స్టార్ట్ చేశాడ‌ని.. దాని టైటిల్‌ ‘గట్టిగా కొడతా..’ అని ఓ పోస్టర్‌, దాంతోపాటు వెకిలి కామెంట్లు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌గా మారాయి. ఈ పోస్ట‌ర్లు నెట్‌లో బాగా ట్రోల్ అవుతున్నాయి. దీనిపై నెటిజ‌న్లు ర‌క‌ర‌కాలుగా కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. ఇవి సుశాంత్ దృష్టికి చేర‌డంతో తీవ్రంగా స్పందించాడు.

‘‘ట్రోలింగ్‌ చేయడం వేరు. కానీ ఫేక్‌ న్యూస్‌ క్రియేట్‌చేసి మరీ ట్రోల్‌ చేయడమేంటో! ఏదేమైనా నాపై ధ్యాస ఉంచిన అందరికీ ధన్యవాధాలు’’ అని హీరో తన ట్విటర్‌లో రాసుకొచ్చారు. టైటిల్ డిఫ‌రెంట్‌గా ఉండ‌డం, దానిపై నెటిజ‌న్లు ర‌క‌ర‌కాలుగా స్పందించ‌డంతో సుశాంత్ బాగా హ‌ర్ట్ అయిన‌ట్లున్నాడు. అందుకే సుశాంత్ ఇంత ఘాటుగా రిప్లే ఇచ్చాడు.

వేధింపుల‌పై అక్కినేని హీరో ఆవేద‌న‌
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share