బుల్లితెర‌పై దుమ్ములేపిన డీజే… టాప్ టీఆర్పీ

స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్ – హ‌రీష్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కి ఈ యేడాది రిలీజ్ అయిన సినిమా డీజే – దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌. బాక్సాఫీస్ వ‌ద్ద అంచ‌నాల‌ను అందుకోలేక‌పోయిన ఈ సినిమా వ‌సూళ్ల‌పై చాలా వివాదాలు న‌డిచాయి. తాజాగా బుల్లితెర‌పై ప్ర‌సారం అయిన డీజే అదిరిపోయే టీఆర్పీతో రికార్డును త‌న అక్కౌంట్‌లో వేసుకుంది. బుల్లి తెరపై నాన్‌ బాహుబలి రికార్డు సొంతం చేసుకుని మరెవ్వరికి సాధ్యం కాని రికార్డును బన్నీ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటి వరకు నాన్‌ బాహుబలి రికార్డు మహేష్‌బాబు ఖాతాలో ఉంది. డీజే దెబ్బ‌తో ఇప్పుడు అది బ‌న్నీ అక్కౌంట్‌లోకి వెళ్లిపోయింది.

బుల్లితెర‌పై డీజే అంచ‌నాల‌ను మించి ఏకంగా 21.7 టీఆర్పీ రేటింగ్ ద‌క్కించుకుంది. ఈ రేంజ్‌లో టీఆర్పీ బాహుబ‌లి మాత్ర‌మే ద‌క్కించుకుంది. డీజేకు భారీ టీఆర్పీ రావ‌డంతో జీ ఛానెల్‌కు భారీగా లాభాలు ద‌క్కాయి. ఈ సినిమాకు ముందు మ‌హేష్‌బాబు కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ శ్రీమంతుడు 21.2 టీఆర్పీతో నాన్‌బాహుబలి రికార్డును సొంతం చేసుకుంది.

ఇప్పుడు బాహుబ‌లి సీరిస్‌ల‌ను ప‌క్క‌న పెట్టేస్తే డీజే రెండో ప్లేస్‌లో ఉంటే, శ్రీమంతుడు సినిమా మూడో ప్లేస్‌లో నిలిచింది. ఈ రెండు సినిమాల త‌ర్వాత ఎన్టీఆర్ జ‌న‌తా గ్యారేజ్ 20.7 టీఆర్పీ రేటింగ్‌తో నాన్‌ బాహుబలి టాప్‌ 3 స్థానంలో ఉంది. ఏదేమైనా వెండితెర‌పై యావ‌రేజ్ టాక్ తెచ్చుకున్న సినిమాతో అల్లు అర్జున్ బుల్లితెర‌పై స‌రికొత్త రికార్డును త‌న ఖాతాలో వేసుకున్నాడు.