డీజే ఫ‌స్టాఫ్‌…సెకండాఫ్ స్టోరీ ఇదే

స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ – డీజే సినిమా మ‌రో రెండు రోజుల్లో థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేందుకు ముస్తాబ‌వుతోంది. బ‌న్నీ నాలుగు వ‌రుస హిట్ల‌తో ఉండ‌డంతో డీజేపై భారీ హైప్ నెల‌కొంది. డీజే థియేట‌ర్ల‌లోకి రావ‌డానికి ముందే స్టోరీ లీక్ అయ్యి ట్రెండ్ అవుతోంది. లీక్ అయిన లైన్ ప్ర‌కారం మ‌న హీరో దువ్వాడ జగన్నాధం (బ‌న్నీ) ఓ అగ్ర‌హారంలో వంట మాస్టార్‌గా ప‌ని చేస్తుంటాడు.

ఆ అగ్ర‌హారంలో ఏ ఫంక్ష‌న్ జ‌రిగినా మ‌నోడే వంట‌లు చేస్తూ అంద‌రి చేత శ‌భాష్ అనిపించుకుంటుంటాడు. ఓ ఫంక్ష‌న్‌లో డీజేకు ప‌రిచ‌యం అయిన పూజాతో ప్రేమ‌లో ప‌డ‌తాడు. అయితే ఆమెను పెళ్లి చేసుకోవాల‌ని ఆమె బావ వెన్నెల కిషోర్ వెంట‌ప‌డుతుంటాడు. ఆ అగ్ర‌హారంలో బ్రాహ్మ‌ణుల పేరు మీద కోట్లాది రూపాయ‌ల విలువ చేసే భూమి ఉంటుంది.

ఆ భూమిపై నిర‌క్ష‌రాస్యుడు అయిన రొయ్య‌ల నాయుడు క‌న్ను ప‌డుతుంది. దాన్ని ఎలాగైనా స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈ స్టోరీ ఇలా ఉండ‌గానే విదేశాల నుంచి మ‌రో విల‌న్ ఆ భూమిపై క‌న్నేసి అక్క‌డ‌కు త‌న గ్యాంగ్‌ను పంపిస్తాడు. అక్క‌డ వాళ్ల‌తో ఫైట్‌తో ఇంట‌ర్వెల్ కార్డు ప‌డుతుంది.

సెకండాఫ్‌లో…

దీంతో బ‌న్నీ త‌న వాళ్లు, ఆ భూమి కోసం త‌న గెట‌ప్ మార్చుకుని విదేశాల్లో ఉన్న విల‌న్‌ను ఢీ కొట్ట‌డానికి అక్క‌డ‌కు వెళ‌తాడు. ఆ విల‌న్‌ను చూసిన బ‌న్నీ షాక్ అవుతాడు. గ‌తంలో త‌న కుటుంబానికి అన్యాయం చేసిన వాడే వీడ‌ని బ‌న్నీ గుర్తిస్తాడు. దీంతో త‌న అగ్ర‌హారం భూముల‌ను లాక్కున్నాడ‌న్న రివేంజ్‌, త‌న ప‌ర్స‌న‌ల్ రివేంజ్‌ను ఎలా తీర్చుకున్నాడు ? చివ‌ర‌కు రొయ్య‌ల నాయుడు ప‌ని ఎలా ప‌ట్టాడు అన్న‌దే డీజే స్టోరీ.

ఇక సినిమాలో కామెడీ ఎపిసోడ్లు, బ‌న్నీ-పూజా ల‌వ్ ట్రాక్‌, డీజే డ్యాన్సులు, విల‌న్ల భ‌ర‌తం ప‌ట్ట‌డం లాంటి అంశాలు సినిమాకు హైలెట్ అవుతాయ‌ని, దిల్ రాజు నిర్మాణ విలువ‌లు, హ‌రీశ్ శంక‌ర్ టేకింగ్ కూడా ప్రెష్‌గా ఉంటుంద‌ట‌.