మెగా టాక్ అంతా వంశీదే!

May 1, 2018 at 2:51 pm
Allu Arjun, Naa peru surya naa illu india, vakrantham vamsi

టాలీవుడ్‌లో డైరెక్ట‌ర్లు ఎవ‌రైనా మెగా కాంపౌండ్ హీరోల‌తో సినిమా చేయాలంటే వాళ్లు పెద్ద అగ్నిప‌రీక్ష‌ను ఎదుర్కోవాల్సిందే. క‌థ నుంచి డైరెక్ష‌న్ వ‌ర‌కు వాళ్లు, వాళ్ల కుటుంబ స‌భ్యులే కాకుండా వాళ్ల కాంపౌండ్‌లో ఉండే వాళ్లు కూడా వేలుపెట్టేస్తార‌న్న టాక్ ఉండ‌నే ఉంది. రాజ‌మౌళి, బోయ‌పాటి నుంచి చాలా మంది ఈ ఇబ్బందులు ప‌డ్డ‌వారే. మ‌గ‌ధీర లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ క్రెడిట్ కూడా రాజ‌మౌళికి ఇచ్చేందుకు మెగా కాంపౌండ్ ఇష్ట‌ప‌డ‌క‌పోవ‌డంతో ఆయ‌న హ‌ర్ట్ అయ్యార‌న్న వార్త‌లు అప్పుడే వ‌చ్చాయి.

 

ఇక లెజెండ్ లాంటి హిట్ త‌ర్వాత కూడా బోయ‌పాటి తిరిగి తిరిగి ఎన్నో అష్ట‌క‌ష్టాలు ప‌డి స‌రైనోడు చేశాడు. సినిమా హిట్ అయితే చాలు ఆ క్రెడిట్ మొత్తం త‌మ హీరో ఖాతాలో వేసేందుకు మెగా కాంపౌండ్ చ‌క్క‌ని స్కెచ్ గీస్తుంది. అదే తేడా కొడితే అదంతా ద‌ర్శ‌కుడి మీద‌కే తోసేస్తుంది. బద్రినాథ్‌, గోవిందుడు అంద‌రివాడేలే, బ్రూస్‌లీ సినిమాలే ఇందుకు ఉదాహ‌ర‌ణ‌. ధృవ హిట్ అయితే ద‌ర్శ‌కుడు సురేంద‌ర్‌రెడ్డికి, ఖైదీ హిట్ అయితే వినాయ‌క్‌కు ఎక్క‌డా పేరు రాలేదు. 

 

ఇక ఇప్పుడు బ‌న్నీ నా పేరు సూర్య విష‌యంలో కూడా ఇలాంటి సందేహాలే ఇండ‌స్ట్రీలో వినిపిస్తున్నాయి. ఈ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో హీరో చాలా ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. అర‌వింద్ అండ్ గ్యాంగ్ కూడా ఎక్కువుగా ద‌ర్శ‌కుడు వ‌క్కంతం వంశీనే ముందు పెడుతోంది. ప్రి రిలీజ్ ఫంక్ష‌న్‌లో కూడా బ‌న్నీ మాట్లాడుతూ ఈ సినిమా క్రెడిట్ మొత్తం నూటికి రెండువందల శాతం వక్కంతం వంశీకే దక్కుతుంది.. మేం అత‌డు చెప్పిన‌ట్టు చేశాం.. క‌థ‌, క‌థ‌నం మొత్తం అత‌డే చూసుకున్నాడ‌ని చెప్పాడు. 

 

అస‌లు బ‌న్నీ క‌థ నుంచి, స్క్రీన్ ప్లే నుంచి క్యారెక్ట‌రైజేష‌న్ వ‌ర‌కు ప్ర‌తి చిన్న విష‌యంలోనూ వేలు పెట్టేస్తాడ‌న్న టాక్ ఉంది. ఈ విష‌యంలో ప‌వ‌న్‌కు అత‌డే పోటీ అంటారు. అలాంటి బ‌న్నీ ఇప్పుడు చేసిన వ్యాఖ్య‌లు చూస్తుంటే సినిమాపై ముంద‌స్తు టాక్ కాస్త తేడాగా ఉన్న నేప‌థ్యంలో ఇదంతా వంశీ మీద‌కు నెట్టేసే ముంద‌స్తు జాగ్ర‌త్తా అన్న చ‌ర్చ స్టార్ట్ అయ్యింది. సినిమా ప్లాప్ అయితే త‌న‌కు ఏ మాత్రం సంబంధం లేద‌ని మెగా కాంపౌండ్ ముందే వంశీ మీద‌కు నెట్టేసే ప్లాన్ వేసేసిందంటున్నారు. హిట్ అయితే మాత్రం అదంతా త‌మ‌దే అని చెప్పుకునేందుకు వీళ్ల ప్లాన్లు మామూలుగా ఉండ‌వుగా..!

 

మెగా టాక్ అంతా వంశీదే!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share