బన్నీ- త్రివిక్రమ్ ముహూర్తం ఫిక్స్

October 27, 2018 at 10:18 am

క్రేజీ కాంబినేష‌న్ త్రివిక్ర‌మ్‌-బ‌న్నీల మ‌రో ప్రాజెక్టు ఫైన‌ల్ ద‌శ‌కు చేరుకుంది. సినిమా చేయ‌డం ఖాయ‌మేగానీ.. ఇంకా కొన్ని చిన్న‌చిన్న విష‌యాలు సంప్ర‌దింపుల ద‌శ‌లో ఉన్నాయి. అవి కూడా ఈ రెండు మూడు రోజుల్లో ఫైన‌ల్ అయ్యే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. అయితే.. కొద్దిరోజులుగా వినిపిస్తున్న హిందీ సినిమా రిమేక్‌నే ఈ ప్రాజెక్టు. అన్నీ అనుకున్న‌వి అనుకున్న‌ట్టు జ‌రిగితే.. వ‌చ్చే డిసెంబ‌ర్ 11న పూజా కార్య‌క్ర‌మం నిర్వహించి, జ‌న‌వ‌రిలో షూటింగ్ ప్రారంభం అయ్యే ఛాన్స్ క‌నిపిస్తోంది. ఇదే విష‌యాన్ని అల్లు అర‌వింద్ డిసైడ్ చేసిన‌ట్లు తెలుస్తోంది. గీతా ఆర్ట్స్ సంస్థ కీల‌క ప్ర‌తినిధుల‌తో స‌మావేశం నిర్వ‌హించి, అర‌వింద్ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం.

trivikram-allu-arjun-18-7-9

అయితే.. ఈ ప్రాజెక్టుకు సంబంధించి మాత్రం ఇంకా కొన్ని విష‌యాలు ఫైన‌ల్ కాలేదు. ఇందులో ప్ర‌ధానంగా నిర్మాత ఎవ‌ర‌న్న‌ది మాత్రం తేల‌లేదు. ఇక గీతా ఆర్ట్స్ సంస్థ మాత్రం దాదాపుగా 50శాతం భాగ‌స్వామిగా ఉండ‌డం ఖాయమ‌నే చెప్పుకోవ‌చ్చు. మిగ‌తా యాభై శాతం భాగ‌స్వామి ఎవ‌ర‌నే విష‌యంలో క్లారిటీ లేదు. దీనికి సంబంధించిన రెండుమూడు పేర్లు వినిపిస్తున్నాయి. నిజానికి ఈ రిమేక్‌తో టీ సిరీస్ సంస్థ తెలుగునాట అడుగుపెట్ట‌బోతుంద‌నే టాక్ వినిపిస్తోంది. మ‌రోవైపు హారిక‌, హాసిని భాగ‌స్వామ్యం కూడా ఉండే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. అయితే ఈ విష‌యాల‌న్నీ మ‌రో రెండు మూడు రోజుల్లో తేలిసిపోనున్నాయి.

ఇక్క‌డ మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. త‌మ‌కు ఈ ప్రాజెక్టులో భాగ‌స్వామ్యం క‌ల్పించాల్సిందేన‌ని టీ సిరీస్ ప‌ట్టుబ‌డితే మాత్రం త్రివిక్ర‌మ్ ఈ రిమేక్‌ను ప‌క్క‌న‌బెట్టి త‌న వ‌ద్ద ఉన్న క‌థ‌తోనే సినిమా తీసే ఛాన్స్ కూడా క‌నిపిస్తోంది. నిజానికి.. ఈ హిందీ సినిమాలో మార్పులు చేసి..త‌న‌దైన మార్క్‌తో రిమేక్ తీసేందుకు త్రివిక్ర‌మ్ ప్లాన్ చేసుకున్న‌ట్లు తెలిసింది. ఒక‌వేళ త్రివిక్ర‌మ్ త‌న సొంత క‌థ‌తోనే సినిమా తీస్తే.. గీతా ఆర్ట్స్‌, హారిక సంస్థ మాత్ర‌మే భాగ‌స్వామ్యంగా ఉంటాయి. ఈ విష‌యాల్లో క్లారిటీ వ‌చ్చిన త‌ర్వాత‌నే ఈ ప్రాజెక్టుపై అధికారికంగా ప్ర‌క‌ట‌న వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఇక త్రివిక్ర‌మ్‌, బ‌న్నీ కాంబినేష‌న్లో ఇప్ప‌టికే రెండు సినిమాలు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఈ సినిమా మూడోది అవుతుంది.

బన్నీ- త్రివిక్రమ్ ముహూర్తం ఫిక్స్
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share