ఈసారి పక్కా మాస్ ఎంట్రటైనర్ తో బన్నీ!

July 9, 2018 at 1:18 pm
Allu Arjun, Vikram Krishna, Movie, Combination, Mass genre

మాస్ ఆడియన్స్ లో బన్నీకి విపరీతమైన క్రేజ్ వుంది. అందువలన తన సినిమాల్లో మాస్ ఆడియన్స్ ను అలరించే అన్ని అంశాలు ఉండేలా ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ఉంటాడు. మాస్ ఆడియన్స్ ను అలరించడం కోసం ఆయన చేసిన సినిమాలే భారీ విజయాలను సాధించాయి. ఇండస్ట్రీలో మనం, 24, హలో లాంటి మాంచి ఫీల్ గుడ్ యూత్ లవ్ ఎంటర్ టైనర్లు చేయగలడని, ఏ జోనర్ సినిమా తీసినా పేరు తెచ్చకున్నాడు విక్రమ్ కుమార్.

కానీ, ఈసారి బన్నితో ఓన్లీ మాస్ ఎంటర్ టైనర్ చేయాలని విక్రమ్ కుమార్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అందువలన కొత్తదనం కోసం అప్పుడప్పుడు ఆయన ఈ జోనర్లో నుంచి బయటికి వెళ్లినా, మళ్లీ వెంటనే ఈ జోనర్లోకి వచ్చేస్తుంటాడు. తన తాజా చిత్రం కూడా మాస్ ఎంటర్టైనర్ జోనర్లోనే ఉండేలా ఆయన చూసుకున్నాడనేది ఫిల్మ్ నగర్ టాక్. ఇందులో మరో విశేషం ఏంటంటే ఈ సినిమాలో బన్నీ డ్యూయల్ రోల్ చేస్తున్నాడట. ఇప్పటి దాకా అల్లు అర్జున్ డబుల్ ఫోటో సినిమా చేయలేదు ఇదే మొదటిది. ఇది కనక నిజమైతే ఫాన్స్ కి పండగే.

ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైన్ మెంట్ జోనర్ లో వుంటుందని తెలుస్తోంది. ఈ మేరకు కొద్దిరోజుల క్రితమే స్క్రిప్ట్ లాక్ చేసారు. బన్నీకి పక్కా కలిసి వచ్చిన జోనర్ కూడా ఇదే. అందుకే ఈసారి విక్రమ్ కుమార్ ఈ లైన్లో వెళ్తున్నట్లు కనిపిస్తోంది. శానం నాగఅశోక్ కుమార్, నల్లమలుపు బుజ్జి కలిసి ఈ సినిమాను నిర్మిస్తారు.

Allu-Arjuns-next-with-Vikr

ఈసారి పక్కా మాస్ ఎంట్రటైనర్ తో బన్నీ!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share