పాపం శిరీష్..అరవింద్ కూడా!

August 16, 2018 at 3:11 pm

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ అంటే ఎంత గొప్ప గౌరవం ఉంటుందో అందరికీ తెలిసిందే. ఈ ఫ్యామిలీ నుంచి ఇప్పటికే అరడజను మంది హీరోలు ఎంట్రీ ఇచ్చారు. చిరంజీవి తర్వాత అంత గొప్ప మాస్ ఇమేజ్ మాత్రం పవన్ కళ్యాన్ కి వచ్చింది. అయితే అల్లు అర్జున్, రామ్ చరణ్ లు కూడా మాస్ ఫాలోయింగ్ అంతో ఇంతో సంపాదించారు. ఈ మద్య వచ్చిన వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్ లు కూడా హిట్టు, ఫ్లాప్ లతో తమకంటూ ఒక క్రేజ్ ఏర్పాటు చేసుకున్నారు. ఇక ఇదే ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో స్టార్ ప్రొడ్యూసర్ తనయుడు స్టైలిష్ స్టార్ తమ్ముడు అల్లు శిరీష్ కి మాత్రం అస్సలు టైమ్ కలిసి రావడం లేదు.

మనోడు నటించిన సినిమాలు హిట్ అయినా కూడా పెద్దగా పేరు మాత్రం రాలేదు. `గౌర‌వం`,` కొత్త జంట‌`, `శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు`, `బియాండ్ బోర్డ‌ర్స్`, `ఒక్క క్ష‌ణం` సినిమాల్లో నటించాడు..కానీ ఇప్పటికీ తన పేరు మాత్రం ఎవ్వరికీ తెలియడం లేదు. ప్ర‌స్తుతం ఓ మ‌ల‌యాళ సినిమా రీమేక్ లో న‌టిస్తున్నాడు. అది అనౌన్స్ చేసి చాలా కాల‌మ‌వుతోంది. అప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కూ ఎలాంటి అప్ డేట్ లేదు.

sirish-allu-hero9

ఆ మద్య మోహల్ లాలు సినిమా యూద్దభూమి లో నటించినా మనోడికి పెద్దగా వర్క్ ఔట్ కాలేదు. ఆ యంగ్ హీరో సినిమాల‌కు మార్కెట్ లేకపోవ‌డంతో నిర్మాత‌లెవ్వ‌రూ సినిమాలు చేయ‌డానికి ముందుకు రావ‌డం లేదు. అటు తండ్రి కూడా శిరీష్ ను దూరం పెట్టిన‌ట్లు తెలుస్తోంది. అర‌వింద్ కేవ‌లం స్టార్ హీరోల‌తో సినిమాలు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అందులో ఒక‌టి మెగాస్టార్ చిరిజీవితో, రెండు అల్లు అర్జున్, మూడు వ‌రుణ్ తేజ్ తో సినిమాలు నిర్మించున్నారు. తన సొంత కొడుకు తో ఒక్క సినిమా ప్లాన్ కూడా చేసుకోకపోవడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.

దీంతో శిరీష్ స్టార్ హీరో డ్రీమ్ నెర‌వేర‌డం క‌ష్ట‌మేన‌ని తెలుస్తోంది. అన్న‌య్య‌లా పెద్ద స్టార్ అవ్వాల‌ని క‌ల‌లు క‌న్నాడు గానీ.. అంత ఈజీ కాద‌ని ఇప్పుడిప్పుడే అర్ధ‌మవుతోన్న‌ట్లుంది. శిరీష్ కి అంత పెద్ద బ్యాగ్ గ్రౌండ్ ఉన్నా…తన తోటి వాళ్ల‌తో ఏ మాత్రం పోటీ ప‌డ‌లేక‌పోతున్నాడు. వెన‌క పెద్ద నిర్మాత‌..అన్న‌య్యా స్టార్ హీరో ఉన్నా? ఏమీ చేయ‌లేని నిస్స‌హాయుడ‌య్యాడు పాపం అల్లు శిరీష్.

Allu-Aravind-Works-in-Pain-Ahead-of-Dhruva-Release

పాపం శిరీష్..అరవింద్ కూడా!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share